ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2023  ఫ్రాన్స్‌లో ప్రారంభమయింది ఈ ఫెస్టివల్ 76వ ఎడిషన్ మే  16 నుంచి మొదలైంది.

ఈ యాన్వల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ నటీనటులు హాజరవుతారు. మన దేశం నుంచి కూడా పలువురు తారలు రెడ్ కార్పెట్‌పై కనువిందు చేశారు. 

ఈ సంవత్సరం, మే 27 వరకు కొనసాగే ఈ చలన చిత్రోత్సవంలో వివిధ భాషలకి చెందిన పలువురు సెలబ్రెటీలు అరంగేట్రం చేస్తున్నారు.

11 రోజులపాటు జరగనున్న ఈ ఈవెంట్ లో టాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దేశీ లుక్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ ఫెస్టివల్ లో 3వ రోజు మెరిసే చీరలో అద్భుతమైన ఫస్ట్ లుక్‌తో అందరినీ కట్టిపడేసింది నటి మృణాల్ ఠాకూర్.  

ఎంబ్రాయిడరీ చేసిన లావెండర్ బ్లింగ్ చీరలో మృణాల్ ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. ఆమె అందం చీరకే వన్నె తెచ్చింది. 

ఈ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలని మృణాల్ తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. 

నన్ను #DesiGirl లాగా భావించినందుకు ధన్యవాదాలు' అంటూ ఆమె ఫోటోలు షేర్ చేయగానే చాలా మంది నుంచి లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. 

ఆమె అభిమాని ఒకరు 'స్టన్నర్' అని రాస్తే, మరొకరు 'మీ గురించి ఎప్పుడూ చాలా గర్వపడుతున్నారు' అని జోడించారు.

స్టార్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు కూడా స్పందించింది. కామెంట్ సెక్షన్ లో లవ్ సింబల్, హార్ట్ సింబల్ ఇచ్చారు.