మురుద్ జంజిరా మహారాష్ట్ర తీరానికి దగ్గరగా అరేబియా సముద్రంలో నిలిచిన అజేయ సముద్రకోటగా భారత చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ఈ కోటను దాడి చేసి స్వాధీనం చేసుకోవాలని మరాఠాలు మొఘలులు పోర్చుగీసులు ఎన్నోసార్లు ప్రయత్నించినా వీలుకాక వెనుదిరిగారు.
సముద్రం మధ్యలో రాతిబండపై నిర్మించిన ఈ కోట శత్రువులకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఇది అసాధారణం అని చరిత్ర చెబుతుంది.
దూరం నుండీ చూస్తే ఈ మురుద్ జంజిరా ప్రవేశద్వారం కనిపించదు. అందుకే ఇది శత్రు దాడులను తట్టుకొనే తెలివైన నిర్మాణ రహస్యం అని భావిస్తారు.
కోటలో ఇప్పటికీ భారీ తుపాకులు, బురుజులు రాజభవనం, మసీదు మంచి నీటి కుంటలు కనిపిస్తాయి. ఇవి సముద్రం మద్య నిలిచిన అద్భుత చారిత్రక ఆనవాళ్లు.
చుట్టూ ఉప్పునీరు ఉన్నా కోటలో తీయని నీరు ఉండటం సందర్శకులను ఇంకా ఆశ్చర్యపరుస్తుంది ఈ ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని పొగడకుండా ఉండలేము.
ఈ కోటపై సిద్దీలు ఎన్నో ఏళ్ల పాటు ఆధిపత్యం కొనసాగించారు సముద్రయుద్ధాల్లో వారి శక్తి కారణంగా జంజిరా ఇప్పటికీ అక్కడ అజేయంగా నిలిచింది.
మరాఠా సామ్రాజ్యానికి చెందిన శివాజీ మహారాజు కూడా ఈ కోటను చేజిక్కించుకోవాలని చాలా ట్రై చేశారు. కానీ జంజిరా అతనికి కూడా అందలేదు.
జంజిరా అనే పేరు అరబిక్ పదం జజీరా నుంచి వచ్చిందని చెబుతారు దాని అర్థం ద్వీపం అందుకే ఇది ద్వీపకోటగా నేటికీ ఎంతో ప్రసిద్ధి చెందింది.
మురుద్ జంజిరా పర్యాటకులను ఆకర్షించే చారిత్రక అద్భుతం మాత్రమే కాదు భారత సముద్ర రక్షణ వైభవాన్ని గుర్తుచేసే సజీవ సాక్ష్యంగా గర్వంగా చెప్పుకోవచ్చు.