శ్రీకృష్ణుడు భూమిపై దైవిక కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది 5,000 సంవత్సరాల క్రితం జరిగింది.
శ్రీకృష్ణుడు భూమిపై దైవిక కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది 5,000 సంవత్సరాల క్రితం జరిగింది.
కృష్ణుని మరణం ద్వాపర యుగం ముగింపును సూచిస్తుందని దుర్వాస మహర్షి ద్వారా ముందుగానే చెప్పటం జరిగింది.
కురుక్షేత్రంలో తన కుమారులను కోల్పోయిన గాంధారి పుత్ర శోకంతో బాధపడుతూ తన వంశం లానే యాదవ వంశం కూడా నాశనమవుతుందని కృష్ణుడిని శపించింది.
జర అనే వేటగాడు జింక అనుకొని పొరపాటున కృష్ణుడి పాదాలపై బాణం వేయడంతో కృష్ణుడు ప్రాణాలు విడిచి పెడతాడు.
కృష్ణుడు తనువు చాలించటం అంటే అతను యోగ నిద్రలోకి జారుకున్నట్లే. అక్కడ అతను విశ్వంతో కలిసిపోయాడు.
కృష్ణుడి మరణంతో ఆయన దివ్య రూపం అదృశ్యమై పోయింది. కేవలం మృత దేహాన్ని మాత్రమే మిగిల్చింది.
కృష్ణుని మరణం ఓ దైవిక సంకల్పం. ప్రాచీన వైదిక ఆచారాలను అనుసరించి ఆయన అంత్యక్రియలను అర్జనుడే స్వయంగా నిర్వహించాడు.
కృష్ణుని మరణం యాదవ రాజవంశం క్షీణతను సూచిస్తుంది. యాదవుల్లో చెలరేగిన అంతర్గత కలహాలు చివరికి వారి వంశం నాశనానికి దారితీసింది.
కృష్ణుడి నిష్క్రమణతో ద్వాపర యుగం ముగిసింది. వంటనే కలియుగం ప్రారంభానికి సంకేతంగామారింది.
కృష్ణుడి బోధనలు మరియు వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. జీవితం మరియు మరణం దాటి ఆత్మ యొక్క ప్రయాణాన్నితెలియ చేస్తుంది.