హార్స్‌షూ క్రాబ్

డైనోసార్లకంటే ముందే వచ్చిన ఈ జంతువు 45 కోట్ల ఏళ్లుగా సముద్ర జలాల్లో జీవిస్తోంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో దీని బ్లడ్ ని ఎంతో వాల్యుబుల్ ఐటమ్ గా ఉపయోగిస్తారు.

నాటిలస్

ఈ సముద్ర జీవి దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం నుంచే ఉంది. రౌండ్ షేప్ లో ఉన్న ప్రత్యేక షెల్ తో చూడటానికి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. 

ట్రిలోబైట్

ఇవి 52 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై వలసలు చేస్తాయి. సముద్రాల్లో నివసించే ఈ జీవులు ఇప్పుడు అంతరించిపోయాయి.

స్కార్పియన్  

ఈ విషజంతువు దాదాపు 43 కోట్ల ఏళ్ల కిందట నుంచే ఉంది. ఇవి భూమిపై జీవించిన తొలినాటి ఆరు కాళ్ల జీవులలో ఒకటి. 

లాటిమెరియా చేప

40 కోట్ల ఏళ్ల కిందటి జీవి ఇది. డైనోసార్లు అంతరించాక కూడా ఇది బ్రతికి ఉంది. దీన్ని "జీవ శిలా"గా పిలుస్తారు.

జెల్లీ ఫిష్ 

ఈ ట్రాన్స్పరెంట్ సముద్ర జీవులు 50 కోట్ల ఏళ్ల కిందట నుంచే ఉన్నాయి. బ్రెయిన్ లేని జీవి అయినప్పటికీ చాలా కాలం బ్రతకగలదు.

సీ స్పాంజ్ 

ఇవి దాదాపు 60 కోట్ల ఏళ్ల పురాతన జీవులు. తక్కువ స్థాయి జీవులైనప్పటికీ, సముద్రాల్లో వీటి ప్రాముఖ్యత ఎక్కువే ఉంది.

బ్రాకియోపాడ్స్ 

ఈ జీవులు 53 కోట్ల ఏళ్లుగా ఉన్నాయి. డైనోసార్లకు ముందే పుట్టిన వీటి ఆకృతి రెండుకప్పలు కలిసి ఉన్నట్లుగా ఉండి   పైన షెల్‌తో ఉంటుంది.

సైనోబాక్టీరియా

ఈ సూక్ష్మజీవులు 3.5 బిలియన్ ఏళ్ల నుండి ఉన్నాయి. భూమిపై ఆక్సిజన్ వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషించాయి.

మిల్లిపీడ్

ఈ భూమిపై మొదటి స్థలజీవులలో మిల్లిపీడ్లు ఒకటి. దాదాపు 42 కోట్ల ఏళ్ల క్రితమే కనిపించాయి. ఇవి పాత కీటకాల జాతికి చెందినవే.