అపోలో 17 తర్వాత చంద్రుడి వైపు మళ్ళీ మనుషులను పంపిన నాసా మిషన్ ఆర్టెమిస్ II. ఈ జర్నీని హిస్టారిక్ క్రూడ్ మిషన్ అని పేర్కొన్నారు.

ఈ చారిత్రాత్మక ప్రయాణంలో రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ అనే నలుగురు ఆస్ట్రోనట్స్ కలిసి ఈ మిషన్‌ ఓరియన్‌లో భాగంగా ప్రయాణిస్తున్నారు.

నాసా విడుదల చేసిన ఫోటోల్లో భూమి నీలి గోళంలా అరోరాలతో అంతరిక్ష నలుపు మధ్య అద్భుతంగా కనిపిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.  

అఫీషియల్ నాసా పోస్టులో కమాండర్ రీడ్ వైజ్‌మన్ స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ విండో నుంచి తీసిన ఎర్త్ ఇమేజ్ ‘హలో వరల్డ్‌’ గా ఈ వారం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయింది. 

ఈ మిషన్‌లో తీసిన కొన్ని ఫోటోలు ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో క్యాప్చర్ చేయబడ్డాయని ఇటీవల సోషల్ మీడియాలో టెక్ ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది.

ఈ జర్నీ దాదాపు పది రోజులపాటు సాగుతుంది చంద్రుడి చుట్టూ ఫ్లైబై చేసి సిస్టమ్స్‌ను పరీక్షించి భూమికి తిరిగిరావడం ప్రధాన లక్ష్యంగా నాసా చెప్పింది.

ఆర్టెమిస్ II అసలు చంద్రుడిపై దిగదు ఫ్యూచర్ లూనార్ మిషన్ల కోసం ఓరియన్ కమ్యూనికేషన్ బయోలాజికల్ సిస్టమ్స్ సురక్షితమా అని నిర్ధారిస్తుంది.

నాసా రియల్-టైమ్ ఆర్బిట్ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు ఓరియన్ ఎక్కడుందో భూమి-చంద్రునికి దూరం ఎంతో మిషన్ పురోగతి ఎలా ఉందొ లైవ్‌ లో చూడగలిగారు.

ఈ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసి అంతరిక్ష ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు మరింత దగ్గరగా చూపించాయి ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో దీనికి సంబందించిన వార్తేలు ఎక్కువయ్యాయి..

అపోలో యుగానంతరం మళ్లీ మనుషులు చంద్రుని వైపు ప్రయాణిస్తున్న ఈ క్షణాలు నాసా భవిష్యత్ ఆర్టెమిస్ III ల్యాండింగ్‌కు పునాది వేస్తున్నాయి అనే భావనను మరింత బలపరుస్తున్నాయి.