ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో పరిశోధకులు ఆశ్చర్యపోయే రాతి చిత్రాలు, పాతకాలపు సాధనాలు బయటపడ్డాయి.
ఈ ఆవిష్కరణలు దాదాపు 10,000 ఏళ్ల క్రితం మనుషులు ఈ ప్రాంతంలో నివసించినట్లు ఆనవాళ్ళు చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాతి గుహలలో కనిపించిన ఈ ఆర్ట్ పిక్చర్స్ అన్నీ ఆ కాలానికి చెందిన ప్రజల వేట, జీవన విధానం, సంస్కృతి గురించి విలువైన ఆధారాలు అందిస్తున్నాయి.
పాతకాలపు రాతి సాధనాలు, ఆయుధాలు కూడా బయటపడటం వల్ల ఈ ప్రాంతం పురాతన నివాస ప్రాంతంగా భావిస్తున్నారు పరిశోధకులు.
ఈ ప్రాంతంలో ఇంకా లోతైన తవ్వకాలు జరగకపోవడం వల్ల పూర్తిస్థాయి నిజాలు ఇంకా వెలుగులోకి రాలేదు అని అంటున్నారు.
కొంతమంది శాస్త్రవేత్తలు ఇది పూర్తిస్థాయి నాగరికత కాకపోవచ్చని, కేవలం వేటగాళ్ల సమూహం మాత్రమే ఇక్కడ ఉండి ఉండవచ్చని కూడా అభిప్రాయ పడుతున్నారు
అయితే మరికొందరు ఇది ప్రాచీన నాగరికత ప్రారంభ దశగా ఉండొచ్చని, భారత చరిత్రను మార్చే అవకాశముందని చెబుతున్నారు.
ఈ డిస్కవరీస్ అన్నీ భారతదేశంలో పురాతన మానవ జీవన చరిత్రను ఇప్పుడు కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయి.
ప్రభుత్వం, పురావస్తు శాఖలు ఈ ప్రాంతంపై మరింత పరిశోధనలు చేపట్టేందుకు ప్లానింగ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు.
భవిష్యత్తులో మరిన్ని తవ్వకాలు జరిగితే ఈ ప్రాంతం నిజంగా 10,000 ఏళ్ల నాటి నాగరికతకు సంబంధించినదా! కాదా! అనే విషయం స్పష్టమవుతుంది.