రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒంటిపై ఉండే ఆరెంజ్ చర్మం, నల్లటి చారలు దీనికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. సుందర్బన్స్ ఫారెస్ట్ వీటి నివాస స్థలం.
రెడ్ ఫాక్స్
పేరుకే ఇది రెడ్ ఫాక్స్ కానీ నిజానికిది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. యూరప్, ఆసియా అడవుల్లో నివసిస్తుంది. ఇది చాలా తెలివైన జీవి.
ఆరెంజ్ ఫ్రాగ్
ఈ చిన్న కప్ప ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఇవి ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో, అడవుల్లో కనిపిస్తాయి. వీటిని పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అని కూడా అంటారు.
ఆరెంజ్ మ్యుటిలిడ్
ఈ చీమ చూడటానికి అచ్చం తేనెటీగలా కనిపిస్తుంది. వీటిని "వెల్వెట్ యాంట్స్" అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఇవి ఓ విధమైన కందిరీగల కుటుంబం
గోల్డెన్ స్నెయిల్
ఈ పసుపు-ఆరెంజ్ కలర్ గల నత్తలు ఆసియా నదుల్లో కనిపిస్తాయి. ఇవి మృదువుగా ఉండే జీవుల్ని తినే వాటిలో ఒకటి.
ఆరెంజ్ జీబ్రాఫిష్
ఈ చేపకి ఆరెంజ్ మరియు తెలుపు గీతలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆఫ్రికా లోతైన నదుల్లో నివసిస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
గోల్డెన్ లయన్ టామరిన్
ఇది చిన్న కోతి జాతికి చెందిన జంతువు. దీని రంగు దీనికి ప్రత్యేకత. బ్రెజిల్ అడవుల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.
ఆరెంజ్ బబూన్ టరాన్టులాస్
ఈ పెద్ద స్పైడర్ దాని శరీరం మొత్తం పూర్తి ఆరెంజ్ కలర్ కలిగి ఉంటుంది. ఇది ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.