నాసా రీసెంట్ గా రిలీజ్ చేసిన పిన్వీల్ గెలాక్సీ ఇమేజ్ ఇది, ఎం101 యొక్క వ్యాస్ట్ స్ట్రక్చర్, బ్రైట్ ఆర్మ్స్, స్టార్ ఫామింగ్ ఏరియాస్ ని ఈసారి క్లియర్ గా రివీల్ చేసింది.

పిన్వీల్ గెలాక్సీని మెస్సియర్ 101 అని కూడా పిలుస్తారు; ఇది భూమికి సమీపంలోని పేస్ ఆన్ స్పైరల్ గెలాక్సీలలో ఒకటి.  

ఈ గెలాక్సీ భూమి నుంచి సుమారు 21 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, అయినా కూడా దీని వివరాలు సైంటిస్టులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి.

హబుల్ టెలీస్కోప్ తీసిన చిత్రాల్లో గెలాక్సీ భుజాల మధ్య గ్యాస్, ధూళి, కొత్త నక్షత్ర సమూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో దాని అందం మరింత పెరిగింది.

నాసా చెబుతున్నట్లుగా, ఎం101 గెలాక్సీపై తీసిన పిక్స్ లో  ఇది చాలా ఎట్రాక్టివ్. దాని నిర్మాణం ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఈ ఇమేజ్ ద్వారా పాత నక్షత్రాలు, యువ నక్షత్రాలు, ధూళి మేఘాలు ఒకే గెలాక్సీలో ఎలా సహజంగా కలిసి ఉన్నాయో తెలుస్తోంది అనే విషయం బలంగా బయటపడింది.  

పిన్వీల్ గెలాక్సీ నేరుగా కనిపించడం వల్ల దాని ఆకారం, మధ్య భాగం, నక్షత్రాల పుట్టుక ప్రాంతాలను శాస్త్రవేత్తలు సులభంగా పరిశీలించగలుగుతున్నారు.

హబుల్ పాత డేటా, ఇతర పరిశీలనలతో కలిపి తీసిన ఈ చిత్రం గెలాక్సీ పూర్తి పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో కీలకంగా మారింది.

ఇలాంటి గెలాక్సీ చిత్రాలు విశ్వం ఎలా పనిచేస్తుంది, నక్షత్రాలు ఎలా పుడతాయి, గ్యాస్ ఎలా కదులుతుంది అన్న విషయాలు తెలుసుకోవడంలో సహాయపడతాయి.

అందుకే నాసా పంచుకున్న ఈ పిన్వీల్ గెలాక్సీ ఫోటో, అందం మాత్రమే కాదు, విశ్వ రహస్యాలను చూపించే శాస్త్రీయ కిటికీగా మారింది అని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు.