రీసెంట్ స్టడీస్ ప్రకారం స్పేస్ లో ప్రెగ్నెన్సీ రావటం పూర్తిగా అసాధ్యం కాదు, కానీ భూమితో పోలిస్తే రీప్రొడక్టివ్ ప్రాసెస్ చాలా కష్టంగా మారవచ్చు.
శాస్త్రవేత్తలు మానిషి, ఎలుక, పంది కణాలపై సిమ్యులేటెడ్ మైక్రోగ్రావిటీలో పరీక్షలు చేసి, ఫర్టిలైజేషన్ దశలు దెబ్బతింటున్నాయని గుర్తించారు ఈ తాజా పరిశోధన ద్వారా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.
గ్రావిటీ లేకపోవడం వల్ల స్పెర్మ్ సెల్స్ సరైన దిశలో కదలడంలో ఇబ్బంది పడ్డాయి, అందువల్ల అండాన్ని చేరే అవకాశాలు తగ్గాయి అని ఫలితాలు నిరూపించాయి.
సాధారణంగా శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ స్పేస్ కండిషన్స్ లో బలహీనపడటంతో, స్పెర్మ్ సెల్స్ నావిగేషన్ కెపాసిటీ తగ్గిందని రీసర్చెస్ నిరూపించాయి.
కొంతమంది సైంటిస్టులు ప్రొజెస్టిరోన్ వంటి సంకేతాలు సహాయపడవచ్చని గమనించినా, నేచురల్ కండిషన్స్ లో అవి పనిచేస్తాయా అనే సందేహం ఇంకా మిగిలే ఉందని వెల్లడించారు.
ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత కూడా ఎంబ్రియో గ్రోత్ స్లో డౌన్ అవ్వటం కనిపించింది, ముఖ్యంగా ఎర్లీ స్టేజ్ లో సెల్ డివైడ్ అయ్యే సమయంలో సమస్యలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఎలుకలలో ఫర్టిలైజేషన్ రేటు తగ్గడం, పంది ఎంబ్రియోలలో అభివృద్ధి ఆలస్యం కనిపించడం వల్ల ఫ్యూచర్ స్పేస్ కాలనీలపై ప్రశ్నలు లేవనెత్తాయి.
అంటే స్పేస్ లో పిల్లలు పుట్టడం అసాధ్యమని కాదు, కానీ సేఫ్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికీ సరైన సైంటిఫిక్ సొల్యూషన్స్ లేవని తేలింది.
మైక్రోగ్రావిటీతో పాటు స్పేస్ రేడియేషన్ కూడా DNA దెబ్బతినే ప్రమాదాన్ని పెంచి, ఎంబ్రియో గ్రోత్ పై ప్రభావం చూపవచ్చని ప్రీవియస్ రివ్యూస్ కూడా హెచ్చరిస్తున్నాయి.
అందుకే మూన్, మార్స్ వంటి ప్లానెట్స్ పై హ్యూమన్ హ్యాబిటేషన్ కంటే ముందుగా స్పేస్ రీప్రొడక్షన్ పై మరింత లాంగ్ టర్మ్ రీసర్చ్ అవసరమని గ్లోబల్ ఎక్స్ పర్ట్స్ పేర్కొన్నారు