ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. దీన్ని ఎక్కే ప్రయత్నంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా, రిస్క్ చేసి జనాలు వెళుతున్నారు.
డెత్ వ్యాలీ
అమెరికాలోని డెత్ వ్యాలీ ఉష్ణోగ్రతలు 55°Cకి చేరతాయి. ప్రాణాలకు ప్రమాదకరమైనా, దాని సహజ అందాలకు సందర్శకులు ఆకర్షితులవుతున్నారు.
అకాపుల్కో
మెక్సికోలోని గ్యాంగ్ వార్స్‌కి కేంద్రం ఈ నగరం అయినా, బీచ్‌లు, రిసార్ట్లు ఉన్నందున సందర్శకులు ఇక్కడకు రావటానికి వెనకాడరు.
నార్త్ సెంటినెల్ ఐలాండ్
ఇండియాలోని ఈ ఐలాండ్ లో నివసించే తెగలు బయట ప్రపంచాన్ని తిరస్కరిస్తారు. అయినా కూడా కొందరు సాహసోపేతంగా అక్కడికి చేరడానికి ప్రయత్నిస్తారు.
చర్నోబిల్
1986 అణుప్రమాదం జరిగిన తర్వాత శ్మశానంలా మారింది ఈ ప్రాంతం. అయినా కొంతమంది ఇక్కడికి వెళ్తున్నారు.
మౌంట్ నైరాగోంగో
ఎప్పుడైనా పేలే అవకాశం ఉన్న ఈ అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే అందమైన ప్రకృతిని చూడటానికి సందర్శకులు వస్తారు. రిస్క్ ఉన్నా అందం మక్కువ పెంచుతుంది.
స్కేలిగ్ మైఖేల్
ఇదిఐర్లాండ్లోని సముద్రం మధ్య ఉన్న పురాతన పర్వత దీవి. ఇక్కడి మఠాలు, క్లిష్టమైన మెట్లు, “స్టార్ వార్స్” షూటింగ్‌తో ఫేమస్ అయింది. ప్రమాదకరమైనా జనం ఇక్కడికి తరలివస్తారు.
బికినీ అటోల్
న్యూక్లియర్ టెస్టులు జరిగిన తర్వాత ఈ పరిసరాలు ప్రమాదకరమని తెలిసినా, డైవింగ్, అడ్వెంచర్ కోసం కొందరు ఇక్కడికి వస్తుంటారు.
మాదెరా రోడ్స్
ఈ రోడ్డంతా పర్వత మార్గాలు వంపులతో నిండి ఉంటుంది. డ్రైవింగ్ లో రిస్క్ ఉన్నా, సీనరీ చూసేందుకు జనం ఇక్కడికి తరలి వస్తారు.
ఆమోజాన్ అడవి
విషపూరిత పాములు, క్రూర జంతువుల మధ్య జీవితం చాలా ప్రమాదకరం. అయినా ఫారెస్ట్ లవర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వస్తారు.