మార్షల్ దీవుల్లోని రూనిట్ డోమ్ అనే కాంక్రీట్ డోమ్ కింద దశాబ్దాల క్రితం నుండీ అమెరికా అణు పరీక్షల నుంచి వచ్చిన భారీ రేడియోధార్మిక వ్యర్థాలు దాచబడ్డాయి.

1958లో జరిగిన క్యాక్టస్ అణు పేలుడుతో ఏర్పడిన భారీ గొయ్యిని వేస్ట్ స్టోరేజ్ ప్లేస్ గా మార్చి పైభాగాన్ని కాంక్రీట్ డోమ్ తో మూసివేశారు అమెరికా అధికారులు.

ఈ డోమ్ లో భారీ ఎత్తున కలుషిత మట్టి, శిథిలాలు, ప్లూటోనియం కలిసిన న్యూక్లియర్ వేస్ట్ ఉన్నాయని రిపోర్ట్స్  చెబుతున్నాయి ఇప్పటికీ వాటిని అక్కడే భద్రపరిచారట.   

ఇప్పుడు డోమ్ పైభాగంలో పగుళ్లు కనిపిస్తున్నాయనే భయాలు పెరుగుతున్నాయి; సముద్ర మట్టం పెరగడం, తుఫాన్లు బలపడటం ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. 

పెద్ద సమస్య ఏమిటంటే ఈ అణు వ్యర్థాల గొయ్యికి క్రింద కాంక్రీట్ అడుగు లేదు; అందువల్ల సముద్ర జలం లోపలికి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సముద్ర అలలు, ఉప్పునీరు, వాతావరణ మార్పుల ప్రభావం కలిసివస్తే ఈ డోమ్ బలహీనపడి రేడియోధార్మిక పదార్థాలు చుట్టుపక్కల నీటిలో కలిసే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు తరచుగా హెచ్చరిస్తున్నారు.

స్థానిక ప్రజలు ఆరోగ్య భద్రత, చేపల వనరులు, సముద్ర జీవవైవిధ్యం పై దీని ప్రభావం గురించి ఎన్నాళ్లుగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి తీవ్రరూపం దాల్చవచ్చని చెబుతున్నా, 2020 అమెరికన్ ఫ్యూయల్ డిపార్టుమెంట్ మాత్రం తక్షణ కూల్చివేత ప్రమాదం ఏమీ లేదని తేల్చేసింది.

అయినప్పటికీ రీసెంట్ స్టోరీస్ మాత్రం పగుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల, పర్యావరణ ప్రమాదాల కారణంగా మళ్లీ ప్రపంచ దృష్టిని ఈ మరచిన ప్రదేశంపై నిలిపాయి.

ఫైనల్ గా ఈ రూనిట్ డోమ్ స్టోరీ మనకి ఏమని చెప్తుందంటే, కోల్డ్ వార్ టైమ్ లో ఏర్పడిన అణు వారసత్వం ఇప్పటికీ ముగియలేదని, ఎప్పటికైనా సముద్రపు ముప్పు పొంచి ఉందని చెబుతోంది