శనిగ్రహం చుట్టూ మరో 11 కొత్త చంద్రులు ఉన్నట్లు గుర్తించడంతో, దాని మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఇప్పుడు 285కి చేరింది.

ఈ కొత్త మూన్స్ ని గుర్తించిన తర్వాత, శనిగ్రహం సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులు కలిగిన గ్రహంగా తన రికార్డును మరింత బలపరిచింది.

2025లోనే 128 కొత్త చంద్రులు గుర్తించబడగా, ఇప్పుడు మరో 11 చేరడంతో శనిగ్రహ చంద్రుల జాబితా మరింత ఎక్కువైంది.

తాజాగా గుర్తించిన ఈ చంద్రులు చాలా చిన్నవి, చాలా దూరంలో తిరిగేవి, కాబట్టి సాధారణంగా వీటిని గుర్తించడం చాలా కష్టం.

ఈ చంద్రులను శాస్త్రవేత్తలు పవర్ ఫుల్ టెలిస్కోప్ చిత్రాలను కలిపే ప్రత్యేక పద్ధతులతో గుర్తించినట్లు రిపోర్ట్స్  చెబుతున్నాయి.  

శనిగ్రహం చుట్టూ ఉన్న చిన్న అసమానాకార చంద్రులు, గతంలో భారీగా ఢీకొన్న ఘటనల అవశేషాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ కొత్త చంద్రుల అన్వేషణ శనిగ్రహ ఉపగ్రహ వ్యవస్థ ఎంత విస్తృతంగా, ఎంత గందరగోళభరితంగా ఉందో మరోసారి చూపించింది.  

శనిగ్రహ చంద్రులలో టైటన్ వంటి భారీ ఉపగ్రహాల నుంచి, ఇప్పుడు గుర్తిస్తున్న అతి సూక్ష్మ చంద్రుల వరకు విభిన్న ప్రపంచాలు ఉన్నాయి.

ఈ కనుగొనుగులు శనిగ్రహం మాత్రమే కాదు, సౌర కుటుంబ ప్రారంభ చరిత్రపై కూడా కొత్త ఆధారాలు అందించే అవకాశముంది.  

‘కింగ్ ఆఫ్ మూన్స్’గా శనిగ్రహం పేరు మరింత బలపడింది; ఇప్పటికి తెలిసిన చంద్రుల సంఖ్య 285తో కొత్త మైలురాయిని చేరుకుంది.