సోమవారం ఉపవాసం శరీరానికి డిటాక్స్‌లా పనిచేసి జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది, మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో , డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

ఉపవాసం సమయంలో శరీరంలో ఆటోఫాజీ ప్రాసెస్  స్టార్ట్ అయి పాత కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫాస్టింగ్ వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఉపవాసం మెదడు పనితీరును మెరుగుపరచి ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

సోమవారం ఉపవాసం హార్మోన్ల సమతుల్యాన్ని నిలుపుతూ శరీర శక్తి వినియోగాన్ని మెరుగుపరుస్తుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

ఆధ్యాత్మిక భావనతో పాటుగా నియమబద్ధమైన ఉపవాసం శరీర జీవ గడియారాన్ని సమతుల్యం చేసి మంచి నిద్రకు దోహదపడుతుంది.