రాజస్థాన్ లోని శేఖావతి ప్రాంతంలో తాజాగా వెలుగులోకి వచ్చిన 1000ఏళ్ల నాటి దేవాలయం చరిత్రకారులు పరిశోధకులు, పురావస్తు నిపుణులకు ఒకేసారి షాకిచ్చింది.

శతాబ్దాలుగా నేలకింద దాగి ఉన్న ఈ పురాతన దేవాలయం ఇప్పుడు నిజమైన చారిత్రక సాక్ష్యాలతో ప్రపంచం ముందుకు వచ్చింది. 

తవ్వకాల సమయంలో బయటపడిన విగ్రహాలు శిల్పాలు రాతి స్తంభాలు దేవాలయం ఒకప్పటి కళాత్మక ప్రతిభను స్పష్టంగా చూపిస్తున్నాయి.

దేవాలయ నిర్మాణశైలి, శిల్పకళ చూస్తే, ఇది రాజపుత్ర కాలానికే చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని తెలియచేస్తూ, శేఖావతి చరిత్రను కొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఇస్తోంది.

ఇక్కడ లభించిన శాసనాలు, ఆ కాలపు రాజులు, దైవారాధన సంప్రదాయాలు, సామాజిక జీవనం గురించి అరుదైన సమాచారాన్ని అందిస్తూ, విలువైన ఆధారాలుగా మారాయి.

దేవాలయం లోపల రహస్య గదులు గుప్త మార్గాలు ఉన్నాయన్న సంకేతాలు బయటపడటంతో ఇది కేవలం పూజాస్థలం కాకుండా రక్షణాత్మక నిర్మాణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

కొందరు పరిశోధకులు ఈ దేవాలయ నిర్మాణం ఖగోళ దిశలను అనుసరించి రూపొందించబడింది. అందువల్ల దీని ప్రత్యేకత మరింత పెరిగిందని చెబుతున్నారు.

గ్రామస్థులు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తూ తరతరాలుగా ఇక్కడ దాగి ఉన్న దేవస్థానం గురించి అనేక రహస్య కథలు చెప్పుకుంటూ రావడం ఇప్పుడు నిజమైంది.

తాజాగా లభించిన ఆధారాలు అక్కడి ప్రజలు చెప్పిన దేవాలయ రహస్యాలకు నిజస్వరూపం ఇచ్చినట్లు  సూచిస్తు న్నాయి.

ఈ దేవాలయం వెలుగులోకి రావడం శేఖావతి మాత్రమే కాదు భారతదేశ ప్రాచీన చరిత్ర అధ్యయనంలో కూడా కీలక మలుపుగా మారి అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.