శివుడు పులిచర్మం ధరించడం ద్వారా అహంకారం, క్రూరత్వం వంటి స్వభావంపై పూర్తి నియంత్రణ సాధించిన పరమయోగిగా భావిస్తారు
బంగారం సంపదకు ప్రతీక అయితే, పులిచర్మం వైరాగ్యానికి ప్రతీక. అందుకే ఇది శివుని త్యాగ జీవనాన్ని తెలియజేస్తుంది
శివుడు రాజసిక ఆభరణాలకంటే సాధారణ జీవనాన్ని గడపటానికే ఇష్టపడతాడని అతను ధరించిన పులిచర్మం నిరూపిస్తుంది
ఈ కారణంగానే అడవిలో నివసించే యోగులకు పులిచర్మం ధ్యానానికి పవిత్రమైన ఆసనంగా పురాతన కాలం నుంచే ఉపయోగించబడేది
పులి క్రూరత్వానికి చిహ్నం. ఆ క్రూరత్వాన్ని లొంగదీసుకుని, మహాదేవుడు తన అదుపులో ఉంచుకున్నాడనడానికి చిహ్నమే ఈ పులిచర్మ ధారణ
బంగారం భౌతిక కోరికలను సూచిస్తే, పులిచర్మం ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుందని మనకి శైవ సంప్రదాయం చెబుతుంది
శివుడు ప్రకృతికి అత్యంత సమీపమైన దేవుడిగా ఉన్నాడని తెలియచేయటానికే పులిచర్మం ధరించి ప్రకృతి జీవనాన్ని ప్రపంచానికి చూపించాడు
పూర్వం దారుకావనంలో నివసించే మునులు తమ మంత్రశక్తులపై విపరీతమైన అహంకారంతో ఉండేవారు. వారి గర్వాన్ని అణచడానికి శివుడు ఒక యువ సన్యాసి రూపంలో అక్కడికి వెళ్ళారు
ఆయన తేజస్సును చూసి మునికాంతలు పరవశించిపోవడంతో, ఆగ్రహించిన మునులు శివుడిని అంతం చేయాలని నిర్ణయించుకొంటారు
వెంటనే ఒక హోమ గుండం ఏర్పాటు చేసి తమ తపోశక్తితో ఒక భయంకరమైన పులిని సృష్టించి శివుని పైకి ఉసిగొల్పుతారు
అది కేవలం జంతువు కాదు, వారి గర్వం నుండి పుట్టిన ఒక సంహారక శక్తి. అందుకే నిప్పులు కక్కే కళ్ళతో, భీకరమైన గాండ్రింపుతో శివుని పైకి దూకింది
కానీ, పరమశివుడు ఆ పులిని సంహరించి, దాని చర్మాన్ని వలిచి తన వస్త్రంగా ధరించారు. ఈ ఘటనతో మునులు తమ తప్పు తెలుసుకుని శివుడి పాదాలపై పడ్డారు
ఇలా మునుల అహంకారానికి చిహ్నమైన ఆ పులిని సంహరించడం ద్వారా, దైవశక్తి ముందు మానవ గర్వం నిలవదని శివుడు నిరూపించారు
అంతేకాదు భయంకరమైన జంతు ప్రవృత్తులైన కామం, కోపం, లోభం వంటి మానవ దుర్గుణాలని జయించినవాడే యోగి అని ఈ పులిచర్మ ధారణ మనకు తెలియజేస్తుంది