మన సోలార్ సిస్టంలో ఉన్న సూర్యుడు, గ్రహాల గురించి మాత్రమే కాదు. దాని ఎండింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పెద్ద సవాలే!
సూర్యుడి ప్రభావం ముగిసే ప్రాంతాన్ని హీలియోస్ఫియర్ అంటారు. ఇది సోలార్ విండ్ బయటకు వెళ్ళి స్పేస్ తో కలిసే బార్డర్ ఏరియా.
ఈ హీలియోస్ఫియర్ ఎండింగ్ ని హీలియోపాజ్ అంటారు. దీనిని సోలార్ సిస్టం మరియు స్పేస్ మధ్య ఉన్న కనిపించని గీతలా భావిస్తారు.
Voyager 1 అనే నాసా స్పేస్‌క్రాఫ్ట్ ఈ హీలియోపాజ్ దాటి బయటకు వెళ్లిన మొదటి మ్యాన్-మేడ్ మిషన్.ఇది 2012లో అచీవ్ అయిన గ్రేట్ విక్టరీ..
హీలియోపాజ్ దాటి వెళ్లిన తర్వాత స్పేస్ కంప్లీట్ డిఫరెన్స్ గా ఉంటుంది. అక్కడ సూర్యుని ప్రభావం తగ్గి, ఇతర నక్షత్రాల ప్రభావం పెరుగుతుంది.
2018లో Voyager 2 కూడా ఈ బోర్డర్ దాటింది. ఇది సైంటిస్టు లకి విలువైన డేటా అందిస్తూ అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది.
అయితే ఈ బౌండరీ లైన్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. సూర్యుడి శక్తి మార్పుల వల్ల హీలియోస్ఫియర్ సైజు కూడా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.
నాసా ఈ ప్రాంతాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొత్త మిషన్లు ప్లాన్ చేస్తోంది. వీటివల్ల ఫ్యూచర్ లో ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ అందుతుంది.
హీలియోస్ఫియర్ బయట ఉన్న ప్రాంతాన్ని ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ అంటారు. ఇది ఇతర నక్షత్రాల మధ్య ఉన్న విశాలమైన ఖాళీ ప్రాంతం.
సోలార్ సిస్టంకి ఖచ్చితమైన బౌండరీ ఇంకా తెలియదు. కానీ హీలియోపాజ్‌ను ప్రస్తుతం మన సోలార్ సిస్టం యొక్క ఔటర్ బౌండరీగా సైంటిస్టులు భావిస్తున్నారు.