సాలార్ డే ఉయునీ 

ఇది బొలీవియాలోని అతిపెద్ద ఉప్పు మైదానం. వర్షాకాలంలో మొత్తం నీటితో నిండిపోయి అద్దంలా కనిపిస్తుంది. దీనిపై నడుస్తుంటే ఆకాశం మీద నడుస్తున్న ఫీల్ కలుగుతుంది.

నార్తర్న్ లైట్స్  

ఆకాశాన్ని రంగురంగుల వెలుగులతో నింపే ఈ నార్తర్న్ లైట్స్ ఐస్లాండ్‌ను ఒక కలల లోకంగా మారుస్తాయి. ఇవి చూడటమే ఒక గొప్ప అనుభూతి.

పాముక్కలే

టర్కీలోని ఈ ప్రాంతంలో వేడి నీరు ప్రవహిస్తూ తెల్లటి ఖనిజ పదార్థాలతో కలిసి టెర్రేసులు ఏర్పడతాయి.

ఆంటిలోప్ కేన్యాన్ 

అత్యద్భుతమైన శిలాఖండాలు, వాటిలోకి వస్తున్న కాంతి రేఖలు కలసి, ప్రకృతి సౌందర్యాన్ని సృష్టిస్తాయి.

సోకొట్రా ద్వీపం

ఇక్కడి డ్రాగన్ బ్లడ్ ట్రీస్ వింత ఆకృతుల వృక్షజాలం ఈ ప్రదేశాన్ని భూమి మీద ఉన్న మరో గ్రహంలా మార్చేస్తాయి.

నామిబ్ ఎడారి  

ఎర్రటి ఇసుకతో నిండిన ఇక్కడి ట్యూన్లు, నీలి ఆకాశంతో కలిసి ఒక చిత్ర కళను గుర్తుకు తెస్తాయి.

హిటాచీ పార్క్

వసంతకాలంలో వేలాదిగా పూచే నెమోఫిలా పూలతో నీలంగా మెరిసే ఈ ఉద్యానవనం, కలల లోకం వలె అనిపిస్తుంది.

సింగింగ్ శాండ్ డ్యూన్స్ 

చైనాలోని ఈ ఇసుక దిబ్బలు గాలితో కలిసి గర్జించే శబ్దాలు చేస్తాయి. ఇది ఒక వింత ప్రకృతి శబ్ద ప్రదర్శన.

రెట్బా సరస్సు 

సెనెగల్ లోని ఈ పింక్ కలర్ లేక్ చూడగానే వావ్ అనిపించే అందాన్ని ఇస్తుంది. ఇది సహజంగా ఏర్పడిన ప్రదేశం.

కప్పడోకియా 

రాతి గుహలలో హాట్ ఎయిర్ బెలూన్లతో నిండి ఉండే ఈ ప్రాంతం, ప్రకృతి మరియు మానవ నిర్మిత కలయికకే పరాకాష్ట.