అల్ప్స్ పర్వతాల మధ్య 291 వంతెనలు, 91 టన్నెల్స్ దాటుకుంటూ చేసే ఈ రైడ్, ప్రకృతిని అత్యంత థ్రిల్లింగ్‌గా అనుభవించేందుకు పర్ఫెక్ట్ జర్నీ.
ది ఘన్
ఇది ఒక ఐకానిక్ ఆస్ట్రేలియన్ ప్యాసింజర్ ట్రైన్. మోస్ట్ అడ్వెంచరస్ రెడ్ డెజర్ట్‌ల మధ్య 2,979 కిలోమీటర్ల అద్భుత ప్రయాణం. ఈ ట్రైన్ ట్రూ అవుట్‌బ్యాక్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది.
కురాండా సీనిక్ రైల్వే
పర్వతాలు, జలపాతాలు, వన్యప్రాణులతో నిండిన ట్రోపికల్ ఫారెస్ట్‌ల మధ్య వెళ్తూ మంచి థ్రిల్ కలిగించే ప్రయాణం ఇది.
రాకీ మౌంటెనీర్
స్నో కప్పిన పర్వతాలు, నదులు, లోయల మధ్య రెండు రోజుల అద్భుతమైన లగ్జరీ జర్నీ. నేచర్ లవర్స్‌కు ఇది బెస్ట్ టూర్.
ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్
ఈ “క్లౌడ్ ట్రైన్” ఆండ్రీస్ పర్వతాలపై 4,220 మీటర్ల ఎత్తులో నడుస్తుంది. మార్గమధ్యంలో 29 బ్రిడ్జిలు, 21 సొరంగాలు దాటుకుంటూ చేసే అద్భుతమైన సాహస యాత్ర ఇది.
బెర్నినా ఎక్స్‌ప్రెస్
స్విట్జర్లాండ్ నుండి ఇటలీకి ప్రయాణించే ఈ రైలు 55 టన్నెల్స్, 196 బ్రిడ్జెస్ దాటి ఆల్ఫ్స్ పర్వతాల్లో ట్రావెల్ చేస్తూ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.
వైట్ పాస్ & యుకాన్ రూట్
ఈ ట్రైన్ హిమపాతాల మధ్య, అరుదైన మార్గాల్లో వెళ్తూ యాక్షన్ సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఈ ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఫ్లామ్ రైల్వే
ఈ రైడ్ 20 కిలోమీటర్లు మాత్రమే అయినా, జలపాతాలు, లోయలు, పర్వతాల మధ్య ట్రావెల్ చేస్తూ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
యునెస్కో వారసత్వ జాబితాలో ఉండే ఈ టాయ్ ట్రైన్, హిమాలయాల్లో తిరుగుతూ అద్వితీయ ప్రకృతి అందాలను చూపిస్తుంది.