హిమాలయ పర్వతాలు

హిమాలయాలు భారత్, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి.

ఆండీస్ పర్వతాలు

దక్షిణ అమెరికాలో ఉన్న ఆండీస్ పర్వతాలు ఏడు దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటిలో అర్జెంటీనా, చిలీ, పెరూ ముఖ్యమైనవి.

ఆల్ప్స్ పర్వతాలు 

యూరప్‌లో ఉన్న ఆల్ప్స్ పర్వతాలు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల మధ్య పరచుకున్నాయి. ఇవి స్కీయింగ్‌కు ప్రసిద్ధి.

రాకీ పర్వతాలు 

ఈ పర్వతాలు ఉత్తర అమెరికాలోని కెనడా మరియు అమెరికా మధ్య సరిహద్దులుగా విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన ప్రదేశం.

కాకసస్ పర్వతాలు

రష్యా, జార్జియా, అర్మేనియా దేశాల మధ్య ఉన్న ఈ పర్వతాలు యూరప్, ఆసియా మధ్య సరిహద్దుగా కనిపిస్తాయి 

పైరినీస్ పర్వతాలు

ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య ఉన్న పైరినీస్ పర్వతాలు ఈ రెండు దేశాల మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తాయి. 

కార్పెథియన్ పర్వతాలు

ఈ పర్వత శ్రేణి చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, ఉక్రెయిన్, రొమేనియా దేశాలను కలుపుతుంది. యూరోపియన్ అడవులకు నిలయం.

బల్కన్ పర్వతాలు  

బల్కన్ పర్వతాలు బల్గేరియా, సెర్బియా, మేసెడోనియా దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి. బల్కన్ ద్వీపకల్పానికి పేరు అందించాయి.

అట్లాస్ పర్వతాలు

ఈ పర్వతాలు మోరోక్కో, అల్‌జీరియా, ట్యూనిషియా దేశాలలో ఉన్నాయి. సహారా ఎడారికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.

స్కాండినేవియన్ పర్వతాలు

నార్వే మరియు స్వీడన్ దేశాల మధ్య పరచుకున్న స్కాండినేవియన్ పర్వతాలు మంచుతో కప్పబడి ఉండే అందమైన ప్రాంతాలు.