బ్యాంకాక్

బ్యాంకాక్‌లో స్ట్రీట్ ఫుడ్ తినటం అంటే మజా. నూడిల్స్, కర్రీలు, డెజర్ట్స్ అన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అలాంటి వంటకాలకు మిచెలిన్ స్టార్స్ కూడా వచ్చాయి.

టోక్యో 

టోక్యోలో వంటకాల్లో శుచి, శుభ్రత, కష్టపడే శ్రమ ఎక్కువగా  కనిపిస్తుంది. ఇక్కడి సుషీ, రామెన్, టెంపురా వంటి వంటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌. 

మెక్సికో 

టాకోస్, బురిటోస్, చిల్లీ వంటి వంటకాలు రుచిని  పరాకాష్టకు తీసుకెళ్తాయి. సంప్రదాయ వంటలతో పాటు మోడ్రన్ వర్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.

బార్సిలోనా  

ఇక్కడ టాపాస్, పాయెల్లా లాంటి వంటకాలు ఫేమస్. వీటిలో టేస్ట్‌తో పాటు కల్చర్ కూడా మిళితమై ఉంటుంది.

హాంగ్‌కాంగ్  

చైనీస్ డిమ్‌సం, నూడిల్స్, బార్బిక్యూ వంటలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్‌ని స్పెషల్‌గా తయారు చేస్తాయి. మిచెలిన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

లండన్ 

లండన్‌కి ప్రపంచంలోని వంటకాలు  మొత్తం వచ్చి కలిసాయి. ఇండియన్, జపనీస్, ఇటాలియన్ ఫుడ్‌కి ఎంతో క్రేజ్ ఉంది.

ప్యారిస్ 

పారిస్ అంటే బ్రెడ్, పేస్ట్రీలు, చీజు వంటివి గుర్తొస్తాయి. ఇక్కడి ఫ్రెంచ్ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

లిమా 

లిమాలో పెరూవియన్, జపనీస్ స్టైల్ వంటకాలు కలిసి ఒక కొత్త టేస్ట్‌ని తీసుకొచ్చాయి. పిస్కో సౌర్ లాంటి డ్రింక్‌ కూడా ఇక్కడ ప్రసిద్ధి. 

కోపెన్‌హాగెన్  

ఇక్కడ "న్యూ నార్డిక్" స్టైల్ వంటలు ఫ్రెష్, హెల్తీ. Noma అనే రెస్టారెంట్ ఇక్కడి ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్‌. 

మెల్‌బోర్న్ 

మెల్బోర్న్‌లో కాఫీ కల్చర్, బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ ప్రపంచానికి ఆదర్శం. చాలా వంటకాలు ఇక్కడ యూనిక్‌గా వుంటాయి.