గ్రీన్లాండ్ షార్క్
గ్రీన్లాండ్ షార్క్ సముద్రంలో నిశ్శబ్దంగా జీవించే చేప. ఈ చేప స్లో మెటబాలిజం కలిగి ఉండి…సుమారు 400 సంవత్సరాల వరకు జీవించగలదు.
బౌహెడ్ తిమింగలం
ఆర్కెటిక్ సముద్రాల్లో కనిపించే బౌహెడ్ తిమింగలం సుమారు 200 సంవత్సరాల వరకు జీవిస్తుంది. దీని డిఎన్ఏ మరణాన్ని ఆలస్యం చేస్తుంది.
రెడ్ సీ ఉర్చిన్
ఈ చిన్న సముద్రజీవి 200 సంవత్సరాల వరకు బతికే శక్తి కలిగి ఉంటుంది. దీని రక్షణ శక్తి ఎంతో గణనీయమైనది.
గాలాపగోస్ టార్టాయిస్
ఈ భారీ తాబేలు 175 సంవత్సరాల వరకు జీవించగలదు. నెమ్మదిగా జీవించడమే దీని దీర్ఘాయువు యొక్క రహస్యం
కోయి ఫిష్
జపాన్‌లో ప్రసిద్ధమైన కోయి ఫిష్ 200 సంవత్సరాల వరకు జీవించవచ్చు. కొన్ని ఫిష్‌ల వయస్సు అయితే రికార్డు స్థాయిలో ఉంది.
రౌగ్ ఐ రాక్‌ఫిష్
ఈ చేప ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇది సుమారు 205 సంవత్సరాల వరకు జీవించగలదు.
అల్డబ్రా జెయింట్ టార్టాయిస్
ఇది 150-200 సంవత్సరాల వరకు జీవించే మరో తాబేలు. దీనికి తక్కువ శరీర గతి, ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది.
గ్లాస్ స్పాంజ్
ఈ సముద్ర స్పాంజ్ జీవులు 10,000 సంవత్సరాలుగా ఉన్నాయని శాస్త్రీయంగా భావిస్తున్నారు. ఇవి సముద్ర గర్భంలో శతాబ్దాలుగా నివసిస్తాయి.
ట్యూవ్ వర్మ్స్
ఈ సముద్ర పురుగులు సముద్ర గర్భాల్లో వందల సంవత్సరాలు జీవించగలవు. వీటి జీవనశైలి అవసరమైనప్పుడు వీటికి శక్తిని తగ్గిస్తుంది.
ఆర్క్టిక్ ఐస్ క్లామ్
ఈ చిన్న జీవి 500 సంవత్సరాలకు పైగా జీవించగలదు. మింగో అనే క్లామ్ 507 ఏళ్ల వయస్సుతో రికార్డు సృష్టించింది