ఆంధ్రప్రదేశ్ – బంగినపల్లి
ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారు. ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు ఎంతో ఫేమస్. ఇవి తీపిగా, గుజ్జుతో నిండినవిగా ఉంటాయి.
ఉత్తరప్రదేశ్ – దసెహరి
ఉత్తరప్రదేశ్ దేశం మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. దసెహరి మామిడికాయలు చిన్నవి. ఇవి మృదువుగా, మధురంగా, ప్రత్యేక సువాసన కలిగి ఉంటాయి.
మహారాష్ట్ర – హాపుస్
మహారాష్ట్రలోని రత్నగిరి హాపుస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనికి మధురమైన రుచి, మృదుత్వం, అరుదైన సువాసన ఉన్నాయి.
గుజరాత్ – కేసర్
గుజరాత్లో జూనాగఢ్ ప్రాంతంలో ఉత్పత్తయ్యే కేసర్ మామిడికాయలు మధురంగా, నారింజ రంగుతో ఆకట్టుకుంటాయి. ఎక్కువశాతం ఇవి ఎగుమతులకు అనువైనవిగా ఉంటాయి.
బీహార్ – జార్జ్
బీహార్లో పుట్టిన జార్జ్ మామిడికాయలు పూర్తిగా గుజ్జుతో, రుచికి మధురంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా భోజనంతోపాటు తినడానికి బాగా వాడతారు.
తెలంగాణ – హిమాయత్
తెలంగాణ రాష్ట్రంలో హిమాయత్ మామిడి ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద పరిమాణంలో ఉండే మామిడికాయ. ఎంతో రుచి కలిగి ఉంటుంది. దీని సుగంధం ప్రత్యేకంగా ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ – హిమ్సాగర్
పశ్చిమ బెంగాల్లో హిమ్సాగర్ మామిడికాయలు మధురంగా, తేమగా ఉండి, ముక్కలు లేకుండా పూర్తిగా గుజ్జుతో నిండివుంటాయి.
కర్ణాటక – సిందూరా
కర్ణాటకలో సిందూరా మామిడి విస్తారంగా ఉత్పత్తి అవుతుంది. వీటికి ఆకర్షణీయమైన రంగు, మధురత ఉండి, రసం తాగడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.
తమిళనాడు – ఇమాంపసంద్
తమిళనాడు రాష్ట్రంలోనూ ఇమాంపసంద్ మామిడికాయలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మృదుత్వంతో, మధురతతో ఉన్న వీటికి ప్రీమియం మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
ఒడిశా – మల్లికా
ఒడిశాలో మల్లికా రకం మామిడికాయలు ఉత్పత్తి అవుతాయి. వీటి రుచి మధురంగా ఉంటుంది. నారింజ రంగుతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇవి మిక్స్డ్ రకాల్లో ఓ బ
ెస్ట్.