యోసెమిటీ నేషనల్ పార్క్ – అమెరికా
భారీ గ్రానైట్ పర్వతాలు, భారీ జలపాతాలు, ప్రాచీన చెట్లు కలసి ప్రకృతి వైభవాన్ని పర్యాటకులకు చూపించే ఓ స్వర్గధామం.
సెరెన్‌గేటి నేషనల్ పార్క్ – టాంజానియా
విల్డ్ బీస్ట్ మైగ్రేషన్, సింహాల వేట, ఆఫ్రికన్ అడవి జీవితం నిజంగా ఇది అందరూ చూడదగిన ప్రదర్శనగా ఉంటుంది.
బాన్‌ఫ్ నేషనల్ పార్క్ – కెనడా
మంచు పర్వతాలు, నీలం సరస్సులు, ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశంగా ఈ పార్క్ ప్రసిద్ధి పొందింది.
జియాంగ్‌జియాజే నేషనల్ పార్క్ – చైనా
నీలం మబ్బుల్లో తేలియాడుతున్నట్టుండే కొండలతో "అవతార్"కు ప్రేరణగా నిలిచిన వింత ప్రకృతి స్వరూపం ఇది.
కృగర్ నేషనల్ పార్క్ – దక్షిణ ఆఫ్రికా
సింహాలు, చిరుతలు, ఏనుగులు సహా బిగ్ ఫైవ్ జంతువుల స్వదేశం. జీవ వైవిధ్యానికి ఇదో ప్రతీక.
టొర్రెస్ డెల్ పైన్ – చిలీ
మంచు కొండలు, నీలి సరస్సులు, గాలుల మురిపెంతో పాటగోనియాలో ప్రకృతి ప్రేమికులకి ఇది స్వర్గాన్ని చూపిస్తుంది.
ఫియోర్డ్లాండ్ నేషనల్ పార్క్ – న్యూజిలాండ్
పర్వతాలు, జలపాతాలు, అల్లకల్లోలమైన ఫియోర్డ్స్ కలసి కలల ప్రకృతిని చూడగల ప్రదేశం.
ప్లిట్వైస్ సరస్సుల పార్క్ – క్రొయేషియా
నీటి ధారల మధ్య మెరుస్తున్న నీలి సరస్సులు, అనేక స్థాయిల జలపాతాలతో ఇది ప్రకృతికి జీవ రూపం.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ – ఇండియా
పులుల సంరక్షణ కేంద్రంగా పేరు పొందిన ఈ పార్క్ భారతీయ అడవి జీవాలకు ఓ గౌరవప్రదమైన నిలయం.
టోరెస్ డెల్ పైన్ – చిలీ
చిలీలోని ఈ పార్క్ మంచుతో కప్పబడ్డ కొండలు, నదులు, గాలులతో వింతగా అనిపించే ప్రకృతి వేదిక.