హిమాలయాలు – ఆసియా

హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు. ఎవరెస్ట్ శిఖరం ఇక్కడే ఉంది. భారత్‌, నేపాల్, భూటాన్‌లో విస్తరించిన ఈ పర్వతాలు ప్రకృతి ప్రేమికులకూ, యాత్రికులకూ స్వర్గధామం.

ఆల్ప్స్ – యూరప్  

ఆల్ప్స్ పర్వతాలు మంచుతో కప్పబడి అద్భుత దృశ్యాలను అందిస్తాయి. స్కీయింగ్‌కు ప్రసిద్ధి గాంచిన ఈ  పర్వతాలు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి.

ఆండీస్ – దక్షిణ అమెరికా

ఆండీస్ పర్వత శ్రేణి ప్రపంచంలోనే అతి పొడవైనది. పెరూ, చిలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో ఇది విస్తరించి ఉంది. మచుపిచ్చు ఇక్కడే ఉంది.

రాకీ – ఉత్తర అమెరికా  

రాకీ పర్వతాలు. నదులు, అడవులు, జంతుజాలంతో పర్యాటకులకు వినోదాన్ని కలిగించే ప్రదేశం. ఇవి కెనడా నుంచి అమెరికా దాకా విస్తరించి ఉన్నాయి. 

డోలమైట్స్ – ఇటలీ

ఇటలీలోని ఉత్తర భాగంలో ఉన్న డోలమైట్స్ పర్వతాలు అరుదైన డోలమైట్ శిలలతో ఏర్పడింది. వాటి ప్రత్యేక ఆకారాలు, పచ్చని పచ్చిక బయళ్ళు మరియు సూర్యోదయ దృశ్యానికి ప్రసిద్ధి.

జపనీస్ ఆల్ప్స్ – జపాన్  

జపాన్‌లోని నిన్ను, చూ, మిన్ను శ్రేణులు కలిసి జపనీస్ ఆల్ప్స్ పర్వతాలు ఏర్పడతాయి. చలికాలంలో ఇక్కడ స్కీయింగ్‌కు ప్రముఖమైనవి.

టోరెస్ డెల్ పైన్ – చిలీ

పాటగోనియాలో ఉన్న ఈ పర్వతాలు వక్రాకార శిఖరాలతో, నీలిరంగు సరస్సులతో ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ ప్రేమికులకు ఇది ఓ అద్భుత ప్రదేశం.

డ్రాకెన్స్‌బర్గ్ – ఆఫ్రికా  

దక్షిణాఫ్రికాలోని ఈ పర్వతాలు పచ్చటి లోయలు, జలపాతాలతో అలరిస్తాయి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి.

సదరన్ ఆల్ప్స్ - న్యూజిలాండ్

న్యూజిలాండ్ దక్షిణ దీవిలోని ఈ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. గ్లేసియర్లు, సరస్సులు, అడవులతో పర్యాటకులను పరవశింపజేస్తాయి.

పిరినీస్ – స్పెయిన్ & ఫ్రాన్స్  

స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య విస్తరించిన ఈ పర్వత  శ్రేణి ట్రెక్కింగ్, స్కీయింగ్, ప్రకృతి అందాల కోసం ఎంతో ప్రసిద్ధి చెందింది.