ఇన్లాండ్ టైపాన్
పెద్దవిగా కనిపించకపోయినా, ఈ పాము విషపూరితంగా ఉంటుంది. వంద మందిని ఒకే ఒక కాటుతో చంపగలదు. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది.
కింగ్ కోబ్రా
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. పాములను కూడా తినగలదు. దక్షిణాసియాలో మాత్రమే కనిపిస్తుంది.
ఫెర్-డె-లాన్స్
దక్షిణ అమెరికాలో నివసించే ఈ పాము కాటు తీవ్రమైన నొప్పి, నరాల నాశనానికి కారణమవుతుంది. చాలా వేగంగా దాడి చేస్తుంది.
బ్లాక్ మాంబా
అఫ్రికాలో నివసించే ఈ పాము అత్యంత వేగంగా కుడుతుంది. రెండు గంటల్లోనే మరణాన్ని కలిగించగలదు. ఇది ఎక్కువగా దాడి చేసే ప్రవర్తన కలిగి ఉంటుంది.
బెల్చర్ సముద్ర పాము
పసిఫిక్ సముద్రంలో నివసించే ఈ పాము అత్యంత విషపూరిత సముద్ర జీవి. అయితే మానవులను అరుదుగా కుడుతుంది.
తైపాన్ పాము
ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ పాము చాలా వేగంగా కుడుతుంది. దీనికాటు మానవునికి మరణాన్ని కలిగిస్తుంది.
సావ్ స్కేల్ వైపర్
ఇండియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల్లో కనిపించే ఈ చిన్న పాము చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఎక్కువ మంది దీని వల్లే మరణించడం జరుగుతుంది.
టైగర్ స్నేక్
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము శత్రువును చూసిన వెంటనే దాడి చేస్తుంది. దీని విషం నరాలు, గుండెపై ప్రభావం చూపుతుంది.
బూమ్స్లాంగ్
ఆఫ్రికాలో కనిపించే ఈ పాము ఊహించని దాడులు చేస్తుంది. దీని విషం రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది – ఇది మరణానికి దారి తీస్తుంది.
డెత్ అడర్
ఈ పాము పొలాల్లో దాగి ఉండి అదును చూసి దాడి చేస్తుంది. దీని కాటు తర్వాత కొన్ని గంటల్లోనే మరణం సంభవించవచ్చు.