ఇన్‌లాండ్ తైపాన్

ఇన్‌లాండ్ తైపాన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. దీని ఒక్క కాటుకి 100 మందిని చంపగలదు. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. చాలా అరుదుగా కనిపించే జాతి ఇది.

కోస్టల్ తైపాన్  

ఇది తూర్పు ఆస్ట్రేలియా, న్యూగినియాలో నివసిస్తుంది. దీని విషం నరాలను దెబ్బతీస్తుంది. శరీర వ్యవస్థ ఫెయిలవుతుంది. వేగంగా కాటేస్తుంది, చికిత్స లేకుంటే ప్రాణాంతకం.

బ్లూ క్రెయిట్ 

దీని విషం కోబ్రా కంటే 16 రెట్లు ప్రమాదకరం. ఇది ప్రధానంగా దక్షిణాసియాలో కనిపిస్తుంది. రాత్రివేళ చురుకుగా ఉండే ఈ పాము చాలా మౌనంగా ఉంటుంది. 

బ్లాక్ మాంబా 

అఫ్రికాలో నివసించే ఈ పాము అత్యంత వేగవంతమైనది. గంటకు 20 కిలోమీటర్లు ప్రయాణించగలదు. రెండు గంటల్లో మానవుని చంపగల విషం కలిగివుంటుంది.

టైగర్ స్నేక్  

ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము తక్షణమే నరాల వ్యవస్థపై ప్రభావం చూపించే విషాన్ని విడిచి పెడుతుంది. 

ఫిలిపైన్ కోబ్రా 

ఇది దూరంగా విషాన్ని ఉమ్మగలదు. తలపై హుడ్ తీయగల ఈ పాము చిన్న కాటు తగిలినా తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. దీని విషం శ్వాసను నిలిపేస్తుంది.

బెల్చర్ సీ స్నేక్ 

ఈ సముద్ర పాము జలచరాల్లో అత్యంత విషపూరితమైనది. సాధారణంగా దీని కాటు బాధించదు కానీ కాటు వేసిన చోట  శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. దీన్ని గల్ఫ్ ప్రాంతాల్లో చూడవచ్చు.

మల్టీబాండెడ్ కరైట్  

చైనాలో కనిపించే ఈ పాము రాత్రిపూట చురుకుగా ఉంటుంది. దీని విషం నరాల వ్యవస్థపై పనిచేస్తుంది. ఇది ఎక్కువగా కొండ ప్రాంతాలలో ఉంటుంది.

కింగ్ కోబ్రా 

దీని పొడవు 18 అడుగులు దాకా ఉంటుంది. ఇది ఇతర పాములను తింటుంది. దీని విషం నేరుగా మెదడును దెబ్బతీసి చనిపించగలదు. ఇది ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.

డెత్ అడ్డర్  

ఈ పాము తక్కువ కదలికతో ఉండి, వేట కోసం వేచి చూస్తుంది. దాని కాటు తక్షణమే నరాల వ్యవస్థను దెబ్బతీసి మరణానికి దారితీస్తుంది. ఇది ఆస్ట్రేలియాలో సాధారణంగా కనిపిస్తుంది.