కాలియాదే ప్యాలెస్ కాలియాదే ప్యాలెస్ ఉజ్జయిని యొక్క రాజులు మరియు యువరాజులతో దాని యొక్క సంస్కృతి మరియు చరిత్రకు చిహ్నంగా ఉంది.

హరసిద్ధి ఆలయం హరసిద్ధి ఆలయంలో ఆధ్యాత్మిక సౌరభాన్ని అనుభవించండి, శక్తివంతమైన దేవత హరసిద్ధికి అంకితం చేయబడింది, ఇది క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు భక్తిపూరితమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.

గడ్కలికా ఆలయం ఈ ఆలయంలోని దేవత కాళిదాసుచే పూజించబడిందని నమ్ముతారు. అందుకే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కల్గి ఉంది. 

జంతర్ మంతర్  దీనినే వేద్ శాల అని కూదా పిలుసారు. ఇది ఓ హిస్టారికల్ అబ్జర్వేటరీ సెంటర్. దీనిని మహారాజా జై సింగ్ నిర్మించారు.

భర్తిహరి గుహలు పచ్చని చెట్ల మధ్య ఉన్న భర్తిహరి గుహలలో మాంక్ అయిన భర్తిహరి ధ్యానం చేసినట్లు నమ్ముతారు.

కాల భైరవ దేవాలయం  ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవానికి ప్రసిద్ధి చెదింది. శివుని ఉగ్ర రూప స్వరూపమైన భైరవునికి అంకితం చేయబడిన ఆలయం. 

చింతామన్ గణేష్ టెంపుల్ ఈ ఆలయం ఉజ్జయినిలో ఉన్న అతి పెద్ద గణేశ దేవాలయం. ఇది భక్తి మరియు నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

సాందీపని ఆశ్రమం ఇది హిందూమతంలో బలరామ కృష్ణులకు విద్యని అందించిన గొప్ప మహర్షి సాందీపని యొక్క జ్ఞాపకార్థం నిర్మించబడింది.

గోపాల్ మందిర్ ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి ఉన్న కళాత్మక వారసత్వానికి నిదర్శనం.

రామ్ ఘాట్ షిప్రా నది ఒడ్డున ఉన్న పవిత్ర స్నాన ఘాట్ అయిన రామ్ ఘాట్ తెల్లవారుజామున మరియు సూర్యాస్తమయం సమయంలో అనేక హారతులు నిర్వహించబడే ప్రదేశం.