హిమాలయాల్లో ఉన్న పవిత్ర శైవక్షేత్రం. శివుడికి అంకితమైన ఈ మందిరం భక్తులకు ఎంతో పవిత్ర పుణ్యదామం. చుట్టూ ఉండే మంచు పర్వతాలు భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.
బద్రీనాథ్
విష్ణువు అవతారమైన బద్రినారాయణ స్వామి ఆలయం. ఇది చారధామ్ యాత్రలో ఒక భాగం. పరమ పవిత్రమైన ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు.
తుంగ్‌నాథ్
పంచ్‌కేదార్‌లో అత్యంత ఎత్తయిన శివాలయం. శివభక్తులకు ఇది పవిత్రమైన స్థలం. హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రేమికులకు సైతం ఇది అద్భుతమైన దారిగా నిలుస్తుంది.
అమర్నాథ్
ప్రముఖ శివలింగం మంచుతో ఏర్పడే ఆలయం. కేవలం కొన్ని వారాలే భక్తులకు దర్శనమిస్తుంది. ఇది అత్యంత కఠినమైనది కానీ ,పవిత్రమైన యాత్రలో ఒకటి.
గంగోత్రి
గంగా నదికి జన్మస్థలం. ఇక్కడ గంగా నదిని తల్లి రూపంలో పూజిస్తారు. భక్తుల కోసం ఇది పవిత్ర యాత్ర స్థలం. మంచుతో కప్పబడిన శిఖరాలు ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి.
గంగోత్రి
గంగా నదికి జన్మస్థలం. ఇక్కడ గంగా నదిని తల్లి రూపంలో పూజిస్తారు. భక్తుల కోసం ఇది పవిత్ర యాత్ర స్థలం. మంచుతో కప్పబడిన శిఖరాలు ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి.
కల్పేశ్వర్
పంచ్‌కేదార్‌లో చివరిది. శివుడిని జడ రూపంలో పూజించే ఆలయం. ఇది హిమాలయాల్లో శాంతియుత ప్రదేశం. ట్రెక్కింగ్‌తో పాటు ఆధ్యాత్మిక అనుభూతికి ఇది ప్రసిద్ధి.
హేమకుండ్ సాహిబ్
సిక్ఖుల పవిత్ర యాత్ర స్థలం. శాంతితో నిండిన సరస్సు పక్కన ఉన్న గురుద్వారా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి మంచు పర్వతాలు ప్రకృతి అందాన్ని చాటుతాయి.
తవాంగ్ మానస్టరీ
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న బౌద్ధమత స్థలం. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద మానస్టరీ. లామా బోధనలు, శాంతి వాతావరణం భక్తులను ఆకర్షిస్తాయి.
స్పితి మానస్టరీలు
స్పితి కై మానస్టరీ, టాబో మానస్టరీ, ధంకర్ మానస్టరీ వంటి అనేక ఆశ్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రకృతి అందాల మధ్యలో ఆధ్యాత్మికత వర్ణనాతీతం.