బోట్స్వానా

ఈ దేశంలో దాదాపు 1.3 లక్షల ఏనుగులు ఉన్నాయి. అఫ్రికాలోని బోట్స్వానా ఏనుగులకు చాలా సురక్షిత స్థలం. ఇక్కడి చోబే జాతీయ పార్క్ ఎంతో ఫేమస్.

జింబాబ్వే 

ఇక్కడ సుమారు 65,000 ఏనుగులు జీవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే పెద్ద పెద్ద అడవుల వల్ల ఏనుగులు  జీవించడానికి అవి నివాస స్థలాలుగా మారాయి. 

తాంజానియా 

ఈ దేశంలో దాదాపు 43,000 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఉండే సెరెంగేటి పార్క్‌లాంటి ప్రాంతాల్లో వాటికి మంచి సంరక్షణ ఉంది.

భారతదేశం  

ఇండియాలో సుమారు 27,000 ఏనుగులు ఉన్నాయి. కర్ణాటక, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

కెన్యా

కెన్యాలో దాదాపు 26,000 ఏనుగులు ఉన్నాయి. మసాయి మారా పార్క్‌ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వీటి సంరక్షణ జరుగుతోంది.

నమీబియా 

ఇక్కడ సుమారు 24,000 ఏనుగులు ఉన్నాయి. ఎటోషా పార్క్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏనుగుల విషయంలో వీళ్ళు తీసుకొనే కేర్ కూడా ఎక్కువే!   

జాంబియా  

ఈ దేశంలో దాదాపు 22,000 ఏనుగులు ఉన్నాయి. చాలా రిజర్వులు, పార్కులు వాటి కోసమే ఏర్పాటు చేశారు.

దక్షిణాఫ్రికా

దాదాపు 21,000 ఏనుగులు ఉన్న దేశం ఇది. కృగర్ నేషనల్ పార్క్‌లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

మొజాంబిక్  

ఈ దేశంలో కూడా పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మానవుల వల్ల వీటికి తీరని ప్రమాదం ఎదురవుతోంది.