గ్లాస్ ఫ్రాగ్ అనే కప్ప శరీరం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. దాని పొట్ట ద్వారా గుండె, పేగులు వంటి ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ క్లియర్ గా కనిపిస్తాయి.
బారెల్ ఐ ఫిష్ తల భాగం పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. లోపల ఉన్న పెద్ద ఆకుపచ్చ కళ్ళు పైకి తిరిగి ఆహారం వెతుకుతాయి.
కొన్ని సీ కుకుంబర్స్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ బాడీ కలిగి ఉంటాయి. లోపలి ఆర్గాన్స్ మొత్తం స్పష్టంగా కనిపిస్తూ సముద్రపు లోతుల్లో నెమ్మదిగా కదులుతాయి.
గ్లాస్ స్క్విడ్ శరీరం దాదాపు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీని ద్వారా లోపల అవయవాలు కనిపిస్తాయి,
సల్ప్ అనే జెల్లీ లాంటి సముద్ర జీవి పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇది గొలుసుల్లా కలిసిపడి సముద్రంలో తేలుతూ ప్లాంక్టన్ తింటుంది.
కొన్ని చిన్న బటర్ ఫిష్ లార్వా దశలో ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. దీంతో అవి సముద్రంలో శత్రువులకు కనిపించకుండా సులభంగా దాగిపోతాయి.
అంటార్కటికాలో ఉండే ఐస్ ఫిష్ బ్లడ్ కూడా దాదాపు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీనిలో హీమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఇది ప్రత్యేకంగా మారింది.
కాంబ్ జెల్లీ అనేది జెల్లీ ఫిష్ లాంటి జీవి. దీని శరీరం పారదర్శకంగా ఉండి కాంతి పడితే రంగురంగుల మెరుపులు ఇస్తుంది.
డీప్ సీ అంఫిపోడ్స్ చిన్న క్రస్టేసియన్ జంతువులు. వీటి శరీరం పారదర్శకంగా ఉండి సముద్రపు లోతుల్లో కనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది.
గ్లాస్ ఆక్టోపస్ శరీరం దాదాపు పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. లోపల గుండె, కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, మిగతా భాగం దాదాపు కనిపించదు.