పిరమిడ్స్ (ఇజిప్టు)

పురాతన రాజధాని మెమ్ఫిస్ దగ్గర ఉన్న గిజా పిరమిడ్, స్ఫింక్స్ విగ్రహాలు, ఇంకా గొప్ప చరిత్ర గుర్తులు ఇక్కడ చూడదగినవి.

యాక్రొపాలిస్ (గ్రీస్)

గ్రీకు దేవతల ఆలయాలన్నీ ఉన్న అద్భుత స్థలం. ఇక్కడి పార్థెనాన్ శిల్పం ఎంతో ప్రాచీనమైనది. చరిత్ర ప్రియులు తప్పక చూడాలి.  

పేట్రా (జోర్డాన్) 

రాళ్లలో చెక్కిన నగరం. గుహల్లో ఆలయాలు, వాటికీ నీటి మార్గాలు  ఇలా పేట్రా చాలా వింతగా కనిపిస్తుంది. ముఖ్యంగా  రెడ్ రాక్ కేవ్స్ ఇక్కడి మెయిన్ ఎట్రాక్షన్.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (చైనా)

వేలాది కిలోమీటర్ల పొడవు ఉన్న చైనా వాల్. దశాన్ని కాపాడటానికి నిర్మించారు. ఇది చూడదగిన చరిత్ర ఘట్టం 

అగ్రా కోట (భారత్)

తాజ్ మహల్ దగ్గర ఉన్న ముఘల్ కోట. ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ కోట ఇరానీ-ఇస్లామిక్ శిల్పకళకి నిదర్శనం 

తాజ్ మహల్ (భారత్)

ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించాడు. తల్లని పాలరాతితో  కట్టిన ఈ స్థలం ప్రపంచ ప్రసిద్ధి పొందింది.

అంగ్కోర్ వాట్ (కాంబోడియా) 

భారీ దేవాలయ సముదాయం. రాళ్లపై శివపార్వతుల చిత్రాలు చెక్కబడ్డాయి. చరిత్రను ప్రేమించే వారికీ ఇది ఓ ఆధ్యాత్మిక కేంద్రం.

హియోరియు-జి (జపాన్) 

ప్రపంచంలోనే అతి పురాతన బౌద్ధ ఆలయం. ఇది మొత్తం చెక్కతో కట్టారు. జపాన్‌ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక గుర్తింపు.

యాపియన్ వే (ఇటలి) 

పురాతన రోమన్ రహదారి. రోమ్ నుంచి పలు నగరాలకు కలిపింది. రోమన్ నిర్మాణశైలి చూడాలనుకొనే వారికి ఇది ఉత్తమ స్థలం.

ప్రెహ్ విహియర్ దేవాలయం (కాంబోడియా)

పర్వతాలపై ఉన్న శివాలయం. రాళ్ళతో కట్టిన అద్భుత శిల్పకళతో ఉన్నది. చరిత్రను ప్రేమించే వారికి ఇది ఓ అద్భుతమైన ప్రదేశం.