ఈ జాతికి చెందిన మగ పక్షి రంగురంగుల వస్తువులతో గూడు కట్టేస్తుంది. దీన్ని పూర్తిగా డెకరేట్ చేసి ఆడ పక్షిని ఆకర్షిస్తుంది. ఇది ప్రేమ కోసం కట్టే ఆర్ట్ వర్క్.
వీవర్ బర్డ్
ఈ బర్డ్ పొడవైన గడ్డి పోచలతో గొప్ప నైపుణ్యంతో వేలాడే గూడు కడుతుంది. ఇది అల్లిన జోలెలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గూడు దాడుల నుంచి రక్షణనిస్తుంది.
హోమ్‌బిల్స్
ఈ పక్షులు పాత చెట్ల రంధ్రాల్లో నివాసం ఉంటాయి. ఆడ పక్షి లోపల ఉండగా, మగ పక్షి బయట భాగాన్ని మట్టి, లాలాజలంతో మూసేస్తుంది.
టైలర్ బర్డ్
ఈ బర్డ్ ఆకులను సూదిలా తయారు చేసి వాటిని కుట్టి చిన్న గూడు కడుతుంది. ఇది ఈ పక్షియొక్క దర్జీ పనికి నిదర్శనం.
మెగాపోడ్స్
ఈ పక్షి మట్టిని, ఆకులను సేకరించి పెద్ద గుట్టలా కట్టి గూడు నిర్మిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణతో గుడ్లను సరైన టెంపరేచర్ లో ఉంచడం వీటి ప్రత్యేకత.
సోషల్ వీవర్
వీటి గూళ్లు ఒక గ్రామంలా ఉంటాయి. వందలాది పక్షులు కలిసికట్టుగా ఒకే చెట్టుపై గూళ్లు కడతాయి. ఇది సామూహిక జీవనానికి ఒక గొప్ప ఉదాహరణ.
హమ్మింగ్ బర్డ్
చిన్న గింజలన్నా, కొబ్బరి తంతువులన్నా ఉపయోగించి చిట్టి, అందమైన గూడు కడుతుంది. ఇది చెట్టు కొమ్మల చివర ఉండి చాలా ముద్దుగా ఉంటుంది.
ఓరియోల్ బర్డ్
వీటి గూడు ఒక ఇంజనీరింగ్ కళాఖండం. ఇవి వేలాడే గూళ్లని కట్టటంలో ప్రొఫెషనల్స్. ఇది మొక్కల నారలు, గడ్డి, తీగలు వంటి మిశ్రమంతో గూడుని అల్లుతుంది.
ఫ్లెమింగోస్
చిన్న మట్టితో గుట్టలా నిర్మించి పైభాగంలో గుడ్డు ఉంచే స్థలం కలిగించేలా గూడు కడతాయి. తడిచిన ప్రాంతాల్లో ఇవి అద్భుతంగా అమరుతాయి.