పేస్ రికగ్నిషన్ టెక్నాలజీ

ఫోన్ స్క్రీన్‌ను చూసిన వెంటనే ముఖాన్ని స్కాన్ చేసి లాక్‌ను ఓపెన్ చేసే టెక్నాలజీ ఇది. పాస్‌వర్డ్ అవసరం లేకుండా సెక్యూరిటీ కలిగిస్తుంది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

వేలు తాకితేనే పనిచేసేదే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ. మానవ శరీర లక్షణాల ఆధారంగా ఫోన్ లాక్ ఓపెన్ చేస్తుంది.

ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ

నరాల మధ్యనున్న ప్రత్యేకమైన కంటి ఆకారాన్ని గుర్తించి లాక్ ఓపెన్ చేసే టెక్నాలజీ. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది.

వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ

వినిపించే గొంతు ఆధారంగా యూజర్‌ను గుర్తించి ఫోన్ లాక్‌ను ఓపెన్ చేయగల గొప్ప టెక్నాలజీ ఇది.

ప్రాక్సిమిటీ & జెస్టర్ సెన్సింగ్ 

చేతి రేఖల ద్వారా ఫోన్‌ను లాక్ చేయటం లేదా అన్‌లాక్ చేయటం. ఈ టెక్నాలజీ స్క్రీన్‌ను తాకకుండానే పనిచేస్తుంది.

హార్ట్‌బీట్ ఆథెంటికేషన్ 

ప్రతి మనిషి హార్ట్ బీటింగ్ భిన్నంగా ఉంటుంది. దానిని ఆధారంగా తీసుకుని లాక్ ఓపెన్ చేసే ఇన్నోవేటివ్  టెక్నాలజీ.

వేర్ బుల్ డివైజ్ అన్‌లాక్

చేతికున్న స్మార్ట్‌వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ ద్వారా ఫోన్ ని అన్ లాక్‌ చేయగల టెక్నాలజీ. ఇది యూజర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది.

బ్రెయిన్‌వేవ్ టెక్నాలజీ

మన యొక్క మానసిక అలజడి, ఆలోచనల ఆధారంగా లాక్‌ను అన్‌లాక్ చేసే పద్ధతి. ఇది డీప్ ఫ్యూచర్ టెక్నాలజీ.

బ్లూటూత్ ప్రాక్సిమిటీ అన్‌లాక్

బ్లూటూత్ డివైజ్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. దీనికి సేఫ్ కంట్రోల్ ఉంది.

జియోఫెన్సింగ్ లాక్

యూజర్ ఏదైనా ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫోన్ అన్‌లాక్ అవుతుంది. GPS ఆధారంగా ఇది పనిచేస్తుంది.