ఋషి కపిలుని జననం  

కపిలుడు తల్లి దేవహూతికి ప్రత్యక్షంగా జన్మించలేదు. తండ్రి ధ్యాన శక్తితో ప్రాణం పోశాడు. ఇది మన క్లోనింగ్ టెక్నాలజీని గుర్తుచేస్తుంది.

పుష్పక విమానం 

రావణుడు వాడిన పుష్పక విమానం స్వయంగా ఎగిరే యంత్రం. ఇది రీసెంట్ గా మనం వాడుతున్న డ్రోన్లు, విమానాలతో పోల్చవచ్చు.

సంజయుడి దృష్టి  

మహాభారత యుద్ధాన్ని సంజయుడు తన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడికి ప్రత్యక్షంగా వివరించడం టెలివిజన్ లైవ్ స్ట్రీమింగ్‌ని గుర్తు చేస్తుంది.

ద్రోణాచార్యుని ఆయుధ నియంత్రణ 

ఆధ్యాత్మిక శక్తితో ద్రోణాచార్యుడు ఆయుధాలను దూరం నుంచి నడిపాడు. ఇది అడ్వాన్స్డ్ రిమోట్ కంట్రోల్ సిస్టంతో పనిచేసే డ్రోన్ మిస్సైల్ టెక్నాలజీ లాంటిది.

కర్ణుని కవచ కుండలాలు   

కర్ణుడు పుట్టుకతోనే కవచంతో పుట్టాడు. ఇది ఆయుధాల ప్రభావాన్ని తిప్పికొట్టే బయో ఇంజనీరింగ్ ప్రొటెక్షన్ టెక్నాలజీని పోలి ఉంటుంది. 

అశ్వత్థామ అమరత్వం 

అశ్వత్థామకు శరాభంగం జరగకపోవడం, శాశ్వత జీవితం లభించడాన్ని చూస్తే అది జీనోమ్ ఎడిటింగ్‌ను గుర్తు చేస్తుంది.

శివ తృణం 

శివుడు గడ్డిపోచతో త్రిపురాసురులను దహనం చేశాడు. ఇది చిన్న వస్తువుతో భారీ విధ్వంసం చేసే అణుబాంబ్ ప్రభావం లాంటిది.