బ్రాహ్మ ముహూర్తంలో నీరు త్రాగడం
ఉదయం 4 నుండి 6 మధ్య తాగిన నీరు శరీర శుద్ధికి సహాయపడుతుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి, మెదడుని ఉల్లాసంగా ఉంటుంది.
రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు
రాగి పాత్రలో రాత్రంతా నిల్వ చేసిన నీరు తాగితే శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
భోజనానికి ముందు నీరు త్రాగడం
వేదాలలో భోజనానికి ముందు నీరు తాగాలని సూచించబడింది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. అధిక తిండిని నివారిస్తుంది.
వేడి నీటితో స్నానం చేయడం
వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నరాలు ఉల్లాసంగా మారి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది వేదాలలో ప్రతిపాదించిన ఆరోగ్య రహస్యాల్లో ఒకటి.
వర్షపు నీటిని నిల్వ చేయడం
వేదకాలంలో వర్షపు నీటిని శుద్ధి చేసి ప్రత్యేక పాత్రల్లో నిల్వ చేసేవారు. ఈ నీరు దేవతల వరంగా భావించబడేది. దీన్ని తాగడం పవిత్రంగా భావించేవారు.
నీటిలో తులసి ఆకులు కలపడం
తులసి ఆకులు కలిపిన నీరు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. వేదాలలో దీన్ని హోలీ వాటర్‌గా పరిగణించేవారు, దీనికి బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఉంది.
చేతిలో నీరు పోసుకుని తాగడం
గాజు లేదా ప్లాస్టిక్ గ్లాసులతో కాకుండా, చేతిలో నీరు పోసుకుని తాగడం వేదకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మేవారు.
ఉదయాన్నే చల్లని నీటితో కళ్లని కడగడం
ఉదయాన్నే చల్లని నీటితో కళ్లను కడగడం చూపుని మెరుగుపరుస్తుంది. వేదాలలో దీనిని దృష్టి శుద్ధి క్రియగా వివరించారట.