కైకాల రేర్ పిక్స్ 

తెలుగు సినీ ఇండస్ట్రీలో నవరస నటనా సార్వభౌముడిగా పేరుపొందిన లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ. 

1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జన్మించారు కైకాల స‌త్య‌నారాయ‌ణ. 

చిన్నతనం నుంచి నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు.

1959లో విడుదలైన `సిపాయి కూతురు` చిత్రంతో   నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

ఆ తర్వాత హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రల్లో  కైకాల నటించారు. 

పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసేవారు.

పాత్రలకు జీవం పోసి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. 

ఈ క్రమంలోనే  'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదు కూడా పొందారు. 

ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 777 చిత్రాల్లో నటించి మెప్పించారు. 

అయితే గత కొద్ధి కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

87 ఏళ్ల కైకాల ఈరోజు వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.