నిద్రలో నడవడం

కొంతమంది నిద్రలోనే నడుస్తూ వేరే ఎక్కడికో వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో వాళ్లకు ఏం జరుగుతుందో గుర్తుండదు. ఇది ఒక న్యూరోలాజికల్ డిసార్డర్.

వస్తువులను తినే అలవాటు 

కొంతమందికి మట్టి, బలపాలు,  సుద్ద, లేదా సబ్బును తినాలని అనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. పోషకాలు లేమి వల్ల ఇలాంటి అలవాటు వస్తుంది.

తమ జుట్టు తామే పీక్కోవడం  

కొంతమంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు  తమ జుట్టును తామే పీక్కొంటూ ఉంటారు. దీన్ని ట్రైకోటిలోమానియా అంటారు. ఇది మానసిక ఒత్తిడికి సంకేతం.

అద్దంలో ఎక్కువ టైం గడపడం

కొంతమందికి తన ముఖం అద్దంలో ఎంత సేపైనా అలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ అనే మానసిక స్థితికి సంకేతం.

చేతులు పదే పదే కడుక్కోవడం  

బాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయంతో కొందరు పదే పదే చేతులు కడుక్కుంటారు. ఇది ఓసీడి (OCD) లక్షణం.

గాలి వాసనల్ని ఆస్వాదించడం

కొంతమందికి పెట్రోల్, పెయింట్,  గాలి ఫ్రెషనర్ వాసన బాగా నచ్చుతుంది. వీటిని అలా పీల్చడం ఆరోగ్యానికి హానికరం.

కారణం లేకుండా నవ్వటం  

ఎటువంటి కారణం లేకుండా కొంతమంది తరచూ నవ్వుతుంటారు. ఇది ఆనందానికి కాదు, కొన్ని న్యూరాలజికల్ డిసార్డర్ల లక్షణం కావచ్చు.