ఇంట్లో దీపం ఆరిపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడకండి. దీనికి భక్తితో పాటు కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి.
గాలి ఎక్కువగా ఉండటం వల్ల లేదా తలుపులు కిటికీలు తెరిచి ఉండటం వల్ల దీపం సహజంగానే ఆరిపోవచ్చు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే.
వత్తి సరిగ్గా లేకపోయినా నూనె లేదా నెయ్యి తక్కువగా ఉన్నప్పుడు దీపం క్రమంగా మసకబారి చివరకు ఆరిపోతుంది ఇది సర్వ సాధారణం
కొంతమంది విశ్వాసాల ప్రకారం దీపం ఆరిపోతే అది మన ఏకాగ్రత లోపానికి కారణమని ఇంకా దృష్టి లేదా నెగటివ్ ఎనర్జీకి సంకేతం అని భావిస్తారు.
పూజ సమయంలో దీపం ఆరిపోతే క్షమాపణ చెప్పుకుని, మళ్ళీ కొత్త వత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత దేవుడిని స్మరించండి.
దీపం స్థిరంగా వెలగకపోతే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉందా అని పరిశీలించుకోవడం అవసరం. దానిని బట్టి కూడా దీపం కొట్టుకుకోవటం, లేదా ఆరిపోవటం వంటివి జరుగుతాయి.
శుభ కార్యక్రమాల సమయంలో దీపం ఆరిపోతే కొందరు దానిని అపశకునంగా భావిస్తారు కానీ దీనికి శాస్త్రీయ ఆధారం ఏదీ లేదు.
దీపం వెలుగు శుభం, ఐశ్వర్యం, సంతోషం, జ్ఞానం, దైవ కరుణకు ప్రతీకగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. దీపం వెలుగుని బట్టి ఆ ఇంటి వాతావరణం ఆధారపడి ఉంటుంది.
దీపం ఆరిపోతే భయపడకుండా కారణం తెలుసుకుని మళ్లీ వెలిగించడం ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. దీనికోసం వత్తిని ఎప్పుడూ పైకి లాగి ఉంచండి. నూనె నిండుగా ఉండేలా చూసుకోండి.
మన విశ్వాసం, మనసులోని భావం ముఖ్యమైనవి దీపం ఆరిపోవదానికి మన ఆలోచనలే ప్రభావం చూపుతాయి. భక్తి అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిశ్చలమైన మనసుతో పూజ కొనసాగించండి.