నౌరూజ్ అనేది పెర్షియన్ నూతన సంవత్సరం, వసంతకాలం మొదటి రోజున దీనిని జరుపుకుంటారు.
నౌరూజ్ అంటే పెర్షియన్ భాషలో "కొత్త రోజు" అని అర్ధం, ఇది 13 రోజులపాటు జరిగే సాంప్రదాయ ఇరానియన్ పండుగ.
పెర్షియన్లు ఈ పండగని పునరుద్ధరణ మరియు పునర్జన్మ సమయం అని నమ్ముతారు. ఇంకా ఇది చీకటిపై వెలుగు యొక్క విజయాన్ని సూచిస్తుంది.
ముఖ్యంగా ఈ ఫెస్టివల్ ఇరాన్‌కే పరిమితం కాలేదు; ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, తజికిస్తాన్ మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మిలియన్ల మంది ప్రజలు దీనిని జరుపుకుంటారు.
దాదాపు 3,000 సంవత్సరాల క్రితం నుండే ఈ నౌరూజ్ ని జరుపుకుంటున్నారు.
నౌరూజ్ సందర్భంగా ప్రజలంతా తమ ఇళ్లను శుభ్రపరుచుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, స్నేహితులను కలుసుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించడం వంటివి చేస్తుంటారు.
ఈ సందర్భంగా హాఫ్ట్-సీన్ అని పిలవబడే ట్రెడిషనల్ వంటకాలతో కూడిన టేబుల్‌టాప్ సెట్టింగ్ ఉంటుంది. అందులో పర్షియన్ లెటర్ "S"తో ప్రారంభమయ్యే 7 ఐటెమ్స్ సింబాలిక్ గా ఉంటాయి.
రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాలు 13వ రోజు సిజ్దా బేదర్లో ముగుస్తాయి.
నౌరూజ్ ఐక్యత యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే ఇది విభిన్న నేపథ్యాల ప్రజలను ఒకచోట చేరుస్తుంది.
2010లో, నౌరూజ్ ప్రాముఖ్యతని ప్రభుత్వం గుర్తించింది. UNESCO వారసత్వ ప్రదేశాలలో ఒకటినిగా నిలిచింది.