మెదడు రీప్లే థియరీ

నిద్రలో మన మెదడు రోజంతా జరిగిన సంఘటనలను మళ్లీ రిపీట్ చేసుకుంటుంది. వాటిని ఎనలైజ్ చేస్తూ మనకు కలల రూపంలో చూపిస్తుంది.

డీప్ డిజైర్స్ థియరీ 

మన అంతర్గత కోరికలు, ఆలోచనలు, బయటకి చెప్పుకోలేని విషయాలు కలల రూపంలో వస్తాయి. ఫ్రాయిడ్ ప్రకారం ఇవే మన కలలకు మూలం 

మెమరీ క్లీనప్ థియరీ

మెదడు అవసరం లేని జ్ఞాపకాలను తొలగించేటప్పుడు కలలు వస్తాయి. ఇది మెమరీ క్లీనింగ్ ప్రాసెస్‌లో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భవిష్యత్తు ప్రిడిక్షన్ థియరీ

కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే విషయాలను సూచిస్తాయని నమ్మకం. ఇది టెలిపథీ లేదా ఇంట్యూషన్‌తో సంబంధం కలిగి ఉండొచ్చు.

బ్రెయిన్ యాక్టివిటీ థియరీ

నిద్రలో మెదడులో అనుకోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వస్తాయి. అవి ఇమేజ్‌లుగా మార్చబడుతూ కలల రూపంలో మనకి చూపిస్తాయి.

భావోద్వేగ నియంత్రణ థియరీ 

కలలు మన భావోద్వేగాలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. శోకాన్ని తగ్గించడం, భయాన్ని అర్థం చేసుకోవడం వంటివి కలలలో జరుగుతాయి.

సమస్య పరిష్కార థియరీ

మనకు ఎదురయ్యే సమస్యలపై మెదడు నిద్రలో ఆలోచిస్తుంది. కొన్నిసార్లు వాటికి సొల్యూషన్ కలల రూపంలో లభించవచ్చు.

ఆత్మ సంబంధిత థియరీ 

కొంతమంది కలల్ని ఆత్మ, పూర్వజన్మ, లేదా దేవదూతలతో సంబంధం ఉన్నవని చెప్తుంటారు. ఇవి భౌతిక ప్రపంచం దాటి వెళ్ళే అర్థాలు ఇస్తాయి.