తాజ్ మహల్ – ఆగ్రా, భారత్

ముంబై సమీపంలోని ప్రేమ చిహ్నం తాజ్ మహల్, ఇది షాహజహాన్ ప్రేమకు ప్రతీక. తెల్లని  పాల రాయితో నిర్మించిన ఈ భవనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా  – చైనా 

చైనా దేశాన్ని రక్షించేందుకు నిర్మించిన పొడవాటి గోడ. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మానవ నిర్మిత నిర్మాణం, వేల సంవత్సరాల చరిత్రను చాటి చెప్పేది.

మచు పిచ్చు – పెరూ 

ఇది పర్వత ప్రాంతంలో ఉన్న ఇంకా నాగరికతకు చెందిన ఓ పురాతన పట్టణం. దీనిని దాచిన నగరం అని పిలుస్తారు. ప్రకృతి అందాలతో కలిసిన చరిత్రను చూపుతుంది.

పేట్రా – జోర్డాన్  

రాళ్ల మధ్యలో చెక్కబడిన నగరం ఇది. ఎర్ర రాళ్లతో నిర్మితమైన ఆలయాలు, ప్రసిద్ధ 'ఖజ్నే' దేవాలయం సందర్శకులను ఎంతో మంత్రముగ్ధులను చేస్తుంది.

గిజా పిరమిడ్లు – ఈజిప్ట్ 

ప్రపంచ ప్రాచీన అద్భుతాల్లో ఒకటి. ఫరోల సమాధులుగా నిర్మించబడ్డ ఈ పిరమిడ్లు, ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం.

కొలొస్సియం – రోమ్, ఇటలీ  

రోమ్ లోని ఈ అంపిథియేటర్ గ్లాడియేటర్ల యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కట్టడం రోమన్ సామ్రాజ్య గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

స్టోన్ హెంజ్ – ఇంగ్లాండ్  

ఈ హెరిటేజ్ సైట్ వెయ్యేళ్ల నాటివి అయిన రాళ్ల నిర్మాణం. శాస్త్రవేత్తలకి ఇది ఒక మిస్టరీ. ఇంకా ఏన్షియంట్ ఆస్ట్రానమీగా కూడా భావిస్తారు.

ఆంగ్‌కోర్ వాట్ – కాంబోడియా   

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్య కళా వైభవాన్ని చూపిస్తుంది. ఇక్కడి శిల్ప కళ ఓ అద్భుతం.

చిచెన్ ఇట్జా – మెక్సికో   

మయన్ నాగరికతకు చెందిన ఈ దేవాలయం ఆస్ట్రానమీ నాలెడ్జ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది టైమ్ లైన్ తెలిపే పిరమిడ్ ఆకృతి.

ఎఫెసస్ – టర్కీ  

గ్రీకు - రోమన్ కాలానికి చెందిన పురాతన నగరం. అర్టెమిస్ ఆలయం ప్రపంచ ప్రాచీన అద్భుతాలలో ఒకటి. ఇంకా ఇది శిల్ప సంపదకు నిదర్శనం.