These 5 Zodiac Signs People are likely to destroy their relationships

ఈ 5 రాశులవారితో సంబంధం పెట్టుకోవాలంటే… కొంచెం ఆలోచించాల్సిందే!

ఏదైనా ఒక బంధం నిలబడాలంటే… దానికి ప్రేమ, నిజాయితీ, నమ్మకం అనే పునాది కావాలి. పునాది గట్టిగా ఉంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. లేనిపక్షంలో అది ఎక్కువరోజులు కొనసాగదు. ఆస్ట్రాలజీ ప్రకారం 5 రాశులకి చెందిన వ్యక్తులు తమ రిలేషన్ షిప్స్ ని ఎక్కువకాలం కంటిన్యూ చేయలేరట. మరి ఆ రాశులేంటో… అలాంటి వారితో మీకేమైనా ఎఫెక్షన్ ఉందేమో… ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే జాగ్రత్త పడండి. 

మేష రాశి:

ఈ రాశి వ్యక్తులు ఎంత త్వరగా ఎదుటివారిని ఎట్రాక్ట్ చేస్తారో… అంతే త్వరగా వారిని రిజెక్ట్ చేస్తారు. అవతలి వ్యక్తితో వీలైనంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, వారు వీరియొక్క నిజ స్వరూపాన్ని గ్రహించినప్పుడు, ఆ సంబంధాన్ని వదిలించుకుంటారు. అందుకే, వీరికి కొత్త సంబంధాలు ఏర్పడటం, విచ్చిన్నమవడం రెండూ ఈజీనే! 

మిథున రాశి:

ఈ రాశి వ్యక్తులకి రిలేషన్ షిప్ అనేది జస్ట్ జోక్. ఎవరితోనైనా ఈజీగా కనెక్ట్  అవుతారు. వారికి బాగున్నంతకాలం బానే ఉంటారు. కానీ, చిరాకు పుడితే రిజెక్ట్ చేస్తారు. స్త్రయిట్ గా చెప్పాలంటే అవసరం తీరిపోతే… వదిలించుకుంటారు. వీళ్ళు అనేకమందితో అనేక వ్యవహారాలు నడుపుతారు. ఆశ్చర్యం ఏంటంటే…  వీరితో రిలేషన్ లో ఉన్నవారు  కూడా వీరి వ్యవహారాల గురించి తెలుసుకోలేరు.

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

కన్యా రాశి:

ఈ రాశి వ్యక్తులకు రిలేషన్ షిప్స్ ఎలా మైంటైన్ చేయాలో బాగా తెలుసు. వీళ్ళు అవతలి వారితో మనస్పూర్తిగా కనెక్ట్ అవుతారు. కాకాపోతే, ప్రతి విషయంలోనూ వీరిదే పైచేయిగా ఉండాలనుకుంటారు. అవతలివారిని డామినేట్ చేస్తుంటారు. ఈ ధోరణి వల్ల ఎదుటి వారు ఒకట్రెండుసార్లు కాంప్రమైజ్ అయినా… ఏదో ఒకసారి అడ్డం తిరుగుతారు. అది వీళ్ళకి అస్సలు నచ్చదు. వెంటనే, రిలేషన్ షిప్ కట్ చేసుకుంటారు. అందుకే వీరికి లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ అచ్చిరాదు.

ధనుస్సు రాశి:

ఈ రాశి వ్యక్తులని చీటర్స్ అనలేము కానీ, ఎమోషన్స్ ఎక్కువని చెప్పాలి.  వీరు తమ రిలేషన్ షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ, దానికంటే తమ ప్రైవసీని ఎక్కువ ప్రేమిస్తారు. అందుకే వీరు ఎలాంటి బంధాన్ని సహించలేరు. ఎవరైనాసరే వీరి ఇష్టాన్నే గౌరవించాలి. అలా కాకుండా అవతలివారు స్వంత నిర్ణయాలు ఏమైనా తీసుకొని, వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తే… ఆ సంబంధాన్ని వదులుకోవటానికి సిద్ధపడతారు. 

మీన రాశి:

ఈ రాశి వ్యక్తులకి తమ రిలేషన్ షిప్స్ పై చాలా అంచనాలు ఉంటాయి. ఎవరైనా వారి అంచనాలను నెరవేర్చలేకపోతే హర్ట్ అవుతారు. ఇక వారిని దూరం పెట్టేస్తారు. ఈ కారణంగా, ఎలాంటివారితోనూ వీరు సంబంధాలు నిలుపుకోలేరు.

SPY Telugu Teaser
SPY Telugu Movie Teaser | Nikhil Siddharth

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top