Tamilnadu Villupuram Firecrackers Blasts Father and Son Dead

నాటు బాంబుల్లా పేలిన క్రాకర్స్… తండ్రి కొడుకు దుర్మరణం (లైవ్ వీడియో)

తమిళనాడు రాష్ట్రం అంటేనే అటు ఉద్యోగాల పరంగా గానీ, వ్యాపారాల పరంగా గానీ, సాంకేతిక పరంగా గానీ, చదువుల పరంగా గానీ ప్రతి నిత్యం బాగా రద్దీగా ఉండే ప్రాంతం. తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరిలో  విల్లుపురం అనే జిల్లాలో ఉదయం 11 గంటల సమయములో ఒక దారుణం సంభవించింది. 

రోజూ మాదిరిగానే ప్రతి ఒక్కరు వారి వారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయములోనే అగస్మాతుగా బారీ శబ్దం వినిపించటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి బయటకు పరుగులు తీసారు. తీరా బయటకు వచ్చి చూసే సరికి ఇంకేముంది ఘటనా స్థలమంతా చిందర బందరుగా పడి ఉన్న రెండు తండ్రి కొడుకుల మృత దేహాలు. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రజలు భయ బ్రాంతులకు గురై… ఎవరికి వారు పరుగులు తీయటంతో ఆ ప్రాంతం అంతా అలజడి ఏర్పడింది. అంతే కాకుండా ఈ ఘటనలో అటుగా వెళ్ళుతున్న మరో ముగ్గురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. 

అసలు ఈ ఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా… దీపావళి పండుగ నేపద్యంలో కే కలైనేశన్ (37), తన కొడుకు ప్రదేష్ (7) తో కలిసి బాణాసంచా కొనుగులు చేశాడు. రెండు బ్యాగుల నిండా తపాసుల్ని నింపుకొని… ఈ ప్రాంతం గుండా బైకుపై వెళ్తున్నారు. 

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఇంతలో ఎదురుగుండా వచ్చిన మరో బైక్ అగస్మాతుగా వీరిని ఢీకొట్టడంతో వీరి దగ్గర ఉన్న నాటు బాంబులు ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. పేలుడు ధాటికి వారి శరీరం అంతా పూర్తిగా తునాతునకలయ్యింది. వారి శరీర భాగాలు కొంత  దూరం వరకు ఎగిరిపడ్డాయి. వారు ప్రయాణిస్తున్న బైక్ పూర్తిగా  ధ్వంసమయ్యింది.  

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కూడా  తీవ్రంగా గాయపడటంతో… వారిని వెంటనే దగ్గర లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న విల్లుపురం డీఐజీ ఎం పాండ్యన్, మరియు జిల్లా ఎస్పీ శ్రీనాథ్ అక్కడకు  చేరుకుని.. ఈ పేలుడుకు  సంబంధించి కారణాలను ఆరా తీస్తూ… కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top