ఈ భూమిపై ఎన్నో ఆధారాలను సముద్రం తన గర్భంలో దాచేసుకుంటుంది. అయితే, వాటి తాలూకు ఆనవాళ్ళను మాత్రం మనకి వదిలేస్తుంటుంది. ఆ ఆనవాళ్ళు దొరికిన రోజు నుంచీ ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాటిలో కొన్ని సాల్వ్ చేసినా… మరికొన్ని మాత్రం ఎప్పటికీ మిస్టరీలు గానే మిగిలి పోతాయి. అలాంటి అంతుచిక్కని రహస్యమే ఈ కుమారి ఖండం. ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ లో లేని ఈ మిథికల్ లాస్ట్ కాంటినెంట్… ఎప్పుడు ఎలా వ్యానిష్ అయిందో… తిరిగి అది ఎలా ఎక్స్ ప్లోర్ చేయబడిందో ఈ స్టోరిలో క్లియర్ గా తెలుసుకుందాం.
అసలు కుమారి కండం అంటే ఏమిటి?
కుమారి ఖండం అనేది గ్రేటర్ ఇండియాలో ఉన్న ఏన్షియంట్ తమిళ్ సివిలైజేషన్ కి సంబంధించిన ఏన్షియంట్ టెర్రిటరీ. ఇది శివుని నుండి తమిళ భాష పుట్టిన ప్రదేశం. ఇక్కడ తమిళ ‘అగతియం’ యొక్క తొలి సాహిత్య రచనలు ప్రచురించబడ్డాయి.
అగతియం అనేది ఫస్ట్ సంగం పీరియడ్ లో గ్రేట్ సేజ్ అయిన అగతియార్ అంటే – అగస్త్య ముని తమిళ్ లో రాసిన మొట్టమొదటి గ్రంధం. దీనిని బట్టి చూస్తే… ఈ భూభాగం వేద కాలం ప్రారంభానికి ముందు అలాగే రామాయణ, మహాభారత కాలానికంటే ముందే అభివృద్ధి చెందింది.
‘సంగం యుగం’ అనేది సౌత్ ఇండియాలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 3వ శతాబ్దం వరకు ఉన్న కాలం. ఏన్షియంట్ సౌత్ ఇండియాలో ‘ముచ్చంగం’ అని పిలువబడే 3 సంగమములు ఉండేవని తమిళ్ మైథాలజీ చెబుతుంది. మధురై పాండ్య రాజుల రాచరికపు పోషణలో ఈ సంగమాలు అభివృద్ధి చెందాయి. వీరి పాలనా సమయంలో జరిగిన కవులు మరియు పండితుల సమ్మేళనం నుండి ఈ పేరు వచ్చింది. “సంగం” అనే పదానికి సాహిత్యపరంగా “సంగమం” అని అర్థం.
మొత్తం సంగం యుగంలో మూడు రాజవంశాలు పాలించబడ్డాయి. అవే – చేరులు, చోళులు మరియు పాండ్యులు. ఈ రాజ్యాల ఎవిడెన్స్ కి సంబందించిన కీ సోర్సెస్ అన్నీ సంగం కాలం నాటి లిటరరీ వర్క్స్ లో క్లియర్ గా ఎక్స్ ప్లెయిన్ చేయబడి ఉంటాయి. అందుకే సంగం లిటరేచర్ ని సౌత్ ఇండియాలోని ఫస్ట్ లిటరేచర్ గా చెప్పుకోవచ్చు. దీని గురించి పాత తమిళ గ్రంథాలలో వివరించబడింది. ఇక కుమారి ఖండం కూడా ఈ రాజుల కాలానికి చెందినదే! స్ట్రెయిట్ గా చెప్పాలంటే, ఈ కుమారి ఖండం భూమి పుట్టిన కొత్తలోనే ఏర్పడింది.
కుమారి ఖండం భూభాగం మొత్తం పరిమాణం శ్రీలంక పరిమాణం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. అందుకే దీనిని గ్రేటర్ ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ గా పిలుస్తారు. అలాగే దాని పేరులో కూడా ‘ఖండం’ అనే పదం ఉంది.
నిజానికి కుమారి ఖండం అనేది అసలు లేదనీ… కేవలం ఇది ఒక మిధ్ అని కొందరంటే… కాదు, ఇది తమిళుల యొక్క ఫెయిరీ టేల్ అని కొందరంటారు. ఇంకొందరైతే ఈ ఖండం నిజమైనదే అనీ… ఇది కోల్పోయిన ‘లెమురియా ఖండం’ అని అంటున్నారు. దీనికి సరైన ఆధారాలు మన దగ్గర లేనప్పటికీ, చరిత్రలో చాలాసార్లు దీని గురించి ప్రస్తావించ బడింది.
కుమారి కండం యొక్క పౌరాణిక మూలం
తమిళ్ ఫోక్ టేల్స్ ప్రకారం, కుమారి ఖండం అనేది సౌత్ ఇండియాలో ఉన్న ఏన్షియంట్ అండ్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ఇది పాండియన్ రాజుల యొక్క జ్ఞానం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న భూమిగా చెప్పబడింది. ఒకానొక సమయంలో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ కాంటినెంట్ సముద్రంలో మునిగిపోయి… పూర్తిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడాప్లేస్ లో దీని తాలూకు ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు. ఒకానొకప్పుడు ఇక్కడ ఒక ఖండం అనేది ఉందని కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
కుమారి కండం యొక్క భౌగోళిక ఆధారాలు
కుమారి ఖండం అనేది మడగాస్కర్, సౌత్ ఇండియా మరియు ఆస్ట్రేలియాలను కలుపుతూ ఏర్పడిన ఒక భారీ భూభాగం అని చాలా మంది రీసర్చర్స్ చెప్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఇది మడగాస్కర్ మరియు ఆస్ట్రేలియాకు అసలు కనెక్ట్ కాలేదు, కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే కనెక్ట్ అయి ఉందని వాదిస్తారు. స్ట్రెయిట్ గా చెప్పాలంటే, ఇది గ్రేటర్ ఇండియాలోని సింగిల్ పీస్ అఫ్ ల్యాండ్.
సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం, గోండ్వానా యొక్క తూర్పు భాగమంతా… మడగాస్కర్, ఆస్ట్రేలియా, ఇండియా మరియు అంటార్కిటికాలతో కూడిన ఓ సూపర్ కాంటినెంట్. కరూ-ఫెర్రార్ ఇగ్నియస్ ప్రావిన్స్ కి వచ్చిన వరద కారణంగా విడిపోవటం ప్రారంభించింది. మడగాస్కర్ గోండ్వానా నుండి విడిపోయి ఇండో – ఆస్ట్రేలియన్ ప్లేట్‌లో చేరింది. ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా నుండి నార్త్-వెస్ట్ డైరెక్షన్ కి కదలడం ప్రారంభించింది. అప్పుడు భారతదేశం మరియు అంటార్కిటికా మధ్య మొదటి సముద్రపు అడుగుభాగం ఏర్పడింది.
ఉత్తరం వైపు మైగ్రేట్ అయి వెళ్ళేటప్పుడు, 65 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన రీయూనియన్ వాల్కెనో హాట్‌స్పాట్ ఎరప్షన్ కారణంగా సీషెల్స్ నుండి రీయూనియన్ వరకు విస్తరించి ఉన్న మడగాస్కర్ మరియు మస్కరెన్ పీఠభూమి భారతదేశం నుండి విడిపోయాయి. భారతదేశం – మడగాస్కర్ – సీషెల్స్ విభజన భారతదేశం యొక్క డెక్కన్ ట్రాప్స్‌తో సమానంగా ఉంటుంది. ఈ ఎరప్షన్ ఇండియాలో డెక్కన్ ట్రాప్‌లను నెలకొల్పింది. ఇది విపరీతమైన బసాల్ట్ లావా బెడ్‌ను సృష్టించింది. అదే సమయంలో సీషెల్స్ మరియు మడగాస్కర్‌లను భారతదేశం నుండి వేరుచేసే చీలికను తెరిచింది.
అప్పుడు ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు మూవ్ అవటం స్టార్ట్ అయింది. భూమధ్యరేఖను దాటి యురేషియా ప్లేట్‌తో కలిసిపోయింది. ఇప్పటికీ, ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 1.4 ఇంచెస్ స్పీడ్ తో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కదులుతోంది. యురేషియన్ ప్లేట్ కూడా నార్త్ ఈస్ట్ వైపు కదులుతోంది, ఇండియన్ ప్లేట్ కంటే చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో, ఇది యురేషియన్ ప్లేట్ డిజేబులిటీకి కారణమవుతుంది. దీనివల్ల ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 0.6 ఇంచెస్ చొప్పున కంప్రెస్ అవ్వొచ్చు.
సుమారు 3 మిలియన్ సంవత్సరాల క్రితం, ఇండియన్ ప్లేట్ మరియు ఆస్ట్రేలియన్ ప్లేట్ రెండూ కూడా క్యాప్రికార్న్ ప్లేట్ తో సపరేట్ చేయబడ్డాయి. ఇప్పుడు అవి బౌండరీస్ దాటి ఎక్స్ ప్యాండ్ అయ్యాయి.
కుమారి ఖండం యొక్క ఎగ్జిస్టెన్స్ ని పాయింట్ అవుట్ చేసేవాళ్ళు ఇండియన్ ఓషన్ లోని జియోలాజికల్ ఫీచర్స్ ని ఈ లాస్ట్ కాంటినెంట్ యొక్క అవశేషాలు గా సూచిస్తారు. రామ సేతుగా పిలవబడే ఆడమ్స్ బ్రిడ్జ్ యొక్క రాక్ ఫార్మేషన్స్ చైన్ అండర్ వాటర్ లో ఉండటం వల్ల ఈ ల్యాండ్ ఒకప్పుడు ఇండియా మరియు శ్రీలంకని కనెక్ట్ చేసే ల్యాండ్ బ్రిడ్జ్ లో భాగమని కొందరు ఊహించారు.