Gandhari's Curse, Afghanistan, Mahabharata

Gandhari’s Prophecy and Afghanistan’s Future

మహాభారతంలోని ప్రతి సంఘటన మన జీవితానికి ఓ గొప్ప గుణపాఠం. దానికి ఉదాహరణే గాంధారి శాపం. ద్వాపరయుగం నుండీ కలియుగం వరకూ వెంటాడుతూ ఉంది ఈ శాపం. పురాణ కాలంలో గాంధారి పెట్టిన శాపం కారణంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతుంది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ కి గాంధారి పెట్టిన శాపమేంటి? అసలు ఆఫ్ఘనిస్తాన్ తో గాంధారికి ఉన్న లింకేంటి? ఇలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం.

గాంధార చరిత్ర ఏమిటి?

ఋగ్వేదం, అథర్వణ వేదం వంటి వేదాలు; రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో ప్రస్తావించబడిన పురాతన భారతీయ రాజ్యం గాంధార.  

గాంధార ప్రాంతంలో నివసించే గాంధారీల గురించి మొదటి ప్రస్తావన ఏంటంటే… వాళ్ళు గొర్రెలను కాసే ఒక తెగగా ఋగ్వేదంలో పేర్కొన్నారు. అథర్వణ వేదంలో కూడా వీరిని మరికొన్ని తెగలలో ఒకటిగా తెలిపారు. 

ఇక రామాయణ కాలంలో రాముని సోదరుడైన భరతుడు ఇక్కడ తక్షశిలని స్థాపించాడు. ఆ తర్వాత భరత వంశస్థులు ఈ ప్రాంతాన్ని పాలించారు. గాంధార తెగని సూపర్ నేచురల్ పవర్స్ కలిగి ఉన్న గంధర్వులు అని కూడా చెప్పేవారు. ఎందుకంటే, మహాభారత కాలంలో యాదవ రాజైన బల రాముడు ఒకసారి తన తీర్థయాత్ర సమయంలో గాంధారానికి దూరంగా ఉన్న సరస్వతి నది ఒడ్డున అనేక గంధర్వ స్థావరాలను చూశాడు. ఇక కురువంశ రాజైన ధృతరాష్ట్రుని భార్య కూడా గాంధారకి చెందినది. అందుకే ఆమెకి గాంధారి అనే పేరుపెట్టబడింది. ఇలా ఎటునుంచీ చూసినా గాంధార ప్రాంతానికీ, అక్కడ నివసించే గాంధార ప్రజలకీ పురాణ కాలం నుంచీ ఓ ప్రత్యేకత ఉంది. 

నిజానికి ఒకప్పుటి గాంధార అంటే ఈరోజు మనం చూసేది కాదు, ఇప్పుడు మనమంతా చెప్పుకొంటున్న ఆఫ్ఘనిస్థాన్ నే అప్పట్లో  గాంధార అనే పేరుతో పిలువబడేది. గాంధార రాజ్యం ఇప్పుడున్న ఉత్తర పాకిస్తాన్ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది పోతోహార్ పీఠభూమి, పెషావర్ లోయ మరియు కాబూల్ నదీ లోయ వరకూ విస్తరించి ఉంది.

ఈ భూభాగమంతా ఒకప్పుడు మన దేశంలోనే కలిసిపోయి  ఉండేది. ఆ తర్వాత భారత్ నుండీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. దీన్నిబట్టి చూస్తే గాంధార అనేది పురాతన భారతీయ ప్రాంతం.

గాంధార రాజ్య యువరాజు ఎవరు?

మహాభారత పురాణం ప్రకారం, సుమారు 5,500 సంవత్సరాల క్రితం ఈ గాంధార రాజ్యాన్ని సుబల అనే రాజు పరిపాలించేవాడు. అతనికి మొత్తం 100 మంది సంతానం. వారిలో 100వ సంతానం శకునైతే, ఆయనకున్న ఏకైక కూతరు గాంధారి. ఈమె మతి అనే దేవత యొక్క అవతారంగా భావిస్తారు. 

అయితే గాంధారి జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆమె జాతకం ఏమీ బాలేదని చెప్తారు. ఆమెను పెళ్ళిచేసుకొనే వారెవరైనా సరే… వాళ్ళ ఆయుష్షు తీరి, వెంటనే మరణిస్తారని కూడా చెప్పారు. ఈ దోషాన్ని పోగొట్టటం కోసం ముందుగా ఆమెకి  ఒక మేకతో వివాహం జరిపించి, వెంటనే ఆ మేకను బలి ఇచ్చి చంపేస్తారు. ఈ విధంగా గాంధారి విధవరాలు అవుతుంది. 

ఆ తరువాత ఆమెకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తగిన వరుడి కోసం వెదుకుతున్న సమయంలో ఒకసారి అనుకోకుండా సుబలుడు భీష్ముడుని కలుస్తాడు. మాటల మద్యలో వీరి మద్య పెళ్ళి టాపిక్ వస్తుంది. అప్పుడు సుబలుడు గాంధారి పెళ్ళి గురించి ప్రస్తావన తెస్తాడు. తన కూతురు పుట్టుకతోనే ధర్మ స్వభావం కలిగి ఉండి అంకిత భావంతో ఉండేదని తనకొక మంచి వరుడి కోసం వెతుకుతున్నానని చెప్తాడు. 

వెంటనే భీష్ముడు పుట్టు గుడ్డివాడైన ద్రుతరాష్ట్రుడికి గాంధారే తగిన భార్య అని, వీరిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని తలచి… ధృతరాష్ట్రుడి గురించి చెప్తాడు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం తెలియనీయకుండా బీష్ముడు చాలా జాగ్రత్త పడతాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ ఒప్పుకోదని తెలిసి భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెడతాడు. మొత్తంమీద వీరిద్దరికీ వివాహం జరిపిస్తారు.

ఇదిలా ఉంటే… అనుకోకుండా ఒకరోజు గాంధారి విధవరాలు అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతాడు. విషయం దాచిపెట్టి తనని మోసం చేసినందుకు ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయండి! అంటూ ఆదేశిస్తాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు. 

రాజాజ్ఞ మేరకు గాంధారి తండ్రిని, సోదరులను బందించి కారాగారంలో వేస్తారు. అయితే, రాజధర్మం ప్రకారం కారాగారంలో వేసిన వాళ్ళందరికీ ఆహరం తప్పకుండా ఇవ్వాలి. కానీ  ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారు. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం బీష్ముడు కాబట్టి అతనిపై పగ పెంచుకుంటాడు  సుబలుడు. 

భీష్ముడిని, ఇంకా కురువంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం అందరిలోకీ తెలివి గలవాడైన శకునిని ఎంచుకొంటాడు. అతనిని ఎలాగయినా బతికించాలని అనుకొంటాడు. ఈ క్రమంలో వారికి పెట్టిన అన్నం మెతుకులన్నిటినీ  కలిపి ఒక ముద్దగా చేస్తాడు. దానిని శకునికి పెట్టి… అతనిని బతికిస్తారు. శకుని తండ్రి, మరియు మిగతా సోదరులు మాత్రం ఆకలితో అలమటించి కొంతకాలానికి జైల్లోనే మరణిస్తారు. 

మరణించే ముందు సబలుడు శకునితో ఇలా అంటాడు. మేమిక్కడ  ఎన్ని నరకయాతనలు అనుభవించి చనిపోతున్నామో నువ్వు కళ్లారా చూశావు కదా! మేమంతా కలిసి నిన్ను బతికించింది నువ్వు మన పగ తీరుస్తాతావని. భవిష్యత్తులో  నీకు రాజభోగాలు కలిగి మన పగను మరిచిపోతే మా ఈ ప్రాణ త్యాగాలకు అర్ధం ఉండదు అని చెబుతాడు. అంతేకాదు,   కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి శకుని తొడ ఎముకను విరిచి అతనిని అవిటివాడిగా కూడా మారుస్తాడు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top