Brutal Attack on Girl

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో)

నడిరోడ్డుపై బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ, బూటుతో తంతూ పాశవిక ఆనదాన్ని అనుభవించాడు. మనదేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది అని మరోసారి రుజువైంది. ఇదంతా జరిగింది వేరేక్కడో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో.

ఢిల్లీ నగరంలోని పశ్చిమ విహార్‌లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి…. ఓ బాలికని బందీగా ఉంచి హింసిస్తున్నాడు. లోపలినుంచీ వెంబడించి కొట్టుకుంటూ వచ్చి… నడిరోడ్డుపై ఎవరైనా చూష్టారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బూటుతో తంతున్నాడు. బాధితురాలు పారిపోయేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఆమెని వదిలిపెట్టలేదు. ఇదంతా అక్కడి సీసీ టీవి కెమెరాలో రికార్డయింది.

ఈ సంఘటనపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాలని వెంటనే మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. అలాగే. ఆపదలో ఉన్న ఆ బాలికకి భద్రత కల్పించే బాధ్యత మహిళా కమిషన్ తీసుకుంది.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

అయితే, ఈ వీడియోని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top