Dhoni Heartwarming Gesture towards Pakistan Players

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో)

ఇండియా-పాకిస్తాన్‌ ల మద్య మ్యాచ్‌ అంటేనే నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది ఇక పాక్ చేతిలో టీమిండియా ఓడిపోయిందంటే… ప్రతి ఒక్కరికీ కోపం కట్టలు తెంచుకొంటుంది. కానీ, నిన్న జరిగింది దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దాయాదుల పోరులో పాక్ దే పైచేయిగా నిలిచింది. అయినప్పటికీ, పాక్, టీమిండియాపై ప్రసంశల జల్లు కురిపించింది. దీనికి కారణం ఏమిటి? 

ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో… టీమిండియా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత్‌పై పాకిస్తాన్‌ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో క్రికెట్ అభిమానుల హృదయాలు బరువెక్కాయి. అనుక్షణం నువ్వా-నేనా అన్నట్లు అన్నట్లు సాగిన ఈ మ్యాచ్… ప్రేక్షకులని తీవ్ర ఆందోళనకీ, ఉద్విగ్నతకీ గురిచేసింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్లు సాగిన ఈ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. 

సాదారణంగా గేమ్ అన్నప్పుడు గెలుపోటములు కామనే! అంతమాత్రం చేత ఒకరిని ఒకరు నిందించుకోవటం కరెక్ట్ కాదు, చేతనైతే అప్రిషియేట్ చేయగలగాలి. అదే అసలైన హీరోఇజం. సరిగ్గా ఇదే చేశారు టీమిండియా మెంతార్‌ ఎంఎస్‌ ధోని, మరియు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

“ఆటలో మనం ప్రత్యర్దులమే కావచ్చు, కానీ మైదానంలో మాత్రం మనమంతా ఒకటే!” అనే భావన వ్యక్తపరిచారు. గిలిచిన పాక్ జట్టుని ప్రత్యేకించి అభినందించారు. ఈ దృశ్యం చూసిన భారతీయుల కళ్ళు చెమర్చాయి. ఇక పాక్ క్రికెటర్లు సైతం వీరి క్రీడా స్పూర్తికి ఫిదా అయిపోయారు. 

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో పాటు, కో- ప్లేయర్స్ అయిన ఇమాద్‌ వసీం, షోయబ్‌ మాలిక్‌ తో సహా పలువురికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందించారు. ఇంకా వారితో కాసేపు ముచ్చటించారు. ఇక పాక్ ప్లేయర్స్ కూడా వీరి అమూల్యమైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. 

మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా ఈ విధంగా చిరునవ్వుతో పాక్‌ ఆటగాళ్లకి విషెస్‌ చెబుతూ హుందాగా ప్రవర్తించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి పాకిస్థానీయుల మనసు దోచుకుంది. 

Illustration of hardworking ants carrying food grains, teaching life lessons of hard work, patience, and teamwork
చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top