“మీసాల పిల్ల” అనేది ఒక ఎనర్జిటిక్ యూత్ సాంగ్, గ్రామీణ మాస్ బీట్‌లతో కూడిన ఫోక్ స్టైల్ మ్యూజిక్‌కి ప్రతీక. ఈ పాటలో ఉన్న లిరిక్స్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, వాటి వెనుక ఉన్న యాటిట్యూడ్ మనసును తాకుతుంది.
ఈ సాంగ్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈసారి రొటీన్‌కి బిన్నంగా “మన శంకర వరప్రసాద్ గారు” అంటూ వింటేజ్ స్టైల్ తో వస్తున్నాడు. మెగాస్టార్ అనే పేరు విన్న వెంటనే మన కళ్ళ ముందు ఒక స్టైలిష్, కాన్ఫిడెంట్, అల్లరి, కానీ నిజాయితీ గల యువకుడి ఇమేజ్ వస్తుంది. ఆ వైబ్రేషన్‌నే ఈ పాట అందిస్తుంది. యూత్ ఫుల్ జోష్, సెన్సాఫ్ ప్రైడ్, ఫ్రెండ్స్ ఫన్ అన్నీ ఈ పాటలో అద్భుతంగా కలిసిపోయాయి.
పాటలోని మ్యూజిక్ రిథమ్‌తో పాటు ప్రతి లైన్‌లో ఉన్న నేటివ్ టచ్, డాన్స్ బీట్‌లు ఈ పాటను ప్రేక్షకుల మనసులో నిలిపేశాయి. TikTok, Instagram Reels, YouTube Shorts లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ పాట వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం దాని మాస్ బీట్, క్యాచీ హుక్ లైన్, మరియు అట్టహాసమైన లిరిక్స్. వీటన్నిటినీ మించి మెగాస్టార్ అసలు పేరును మూవీ టైటిల్‌గా పెట్టడం.
ఈ పాటను ఎవరైనా వినగానే ఆత్మవిశ్వాసం, ఫుల్ ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది. యువతలోని స్ఫూర్తిని ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. అందుకే, ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ఈ ఒక్క పాటతో ఎక్కడికో వెళ్లిపోయాయి.