మహాభారతం అంటేనే… ఎన్నో కథలు, మరెన్నో జీవిత సత్యాలని బోధించే ఒక పురాతన ఇతిహాసం. ఇందులో తవ్వేకొద్దీ ఎన్నో రహశ్యాలు, ఇంకెన్నో పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. అలాంటి వారిలో బార్బారికుడు ఒకడు. మహాభారత యుద్ధాన్ని కేవలం ఓకే ఒక్క నిముషంలో ముగించగల గ్రేట్ వారియర్ ఇతను. అంత క్యాపబులిటీ ఉండి కూడా తనని తాను సెల్ఫ్-శాక్రిఫైజ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ లెజెండ్ బార్బారికుడు. అలాంటి బార్బారికుడికి శ్రీకృష్ణుడు చేసిన ప్రామిస్ ఏంటి? ఇప్పటికీ అతను కృష్ణుడితో సమానంగా ఎందుకు పూజించ బడుతున్నాడో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
బార్బారికుడు ఎవరు?
బార్బారికుడు మరెవరో కాదు, పాండవులలో ఒకరైన భీముని మనుమడు, ఘటోత్కచుని కుమారుడు. మహాభారతంలో లక్క ఇంటిని తగలబెట్టిన తర్వాత తన తల్లిని, మరియు సోదరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత భీమునిపై పెడతాడు కృష్ణుడు. ఆయన మాట మేరకు వారందరినీ ఓ సేఫ్టీ ప్లేస్ లో ఉంచుతాడు భీముడు. ఆ సమయంలో నరవాసన పసిగట్టి… వారిని చంపి తిందామని అక్కడికి వస్తుంది రాక్షస జాతికి చెందిన హిడింభి.
కానీ, భీముడిని చూశాక, తన మనసు మార్చుకుంటుంది. ఎలాగైనా సరే అతనిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. వెంటనే మానవ రూపం ధరించి… కుంతీదేవి దగ్గరికి వెళ్లి వేడుకుంటుంది. తల్లి ఆజ్ఞ మేరకు హిడింభిని పెళ్ళాడతాడు భీముడు. వీరిద్దరికీ పుట్టిన కొడుకే ఘటోత్కచుడు.
ఘటోత్కచుడు ఇంద్రజాల విద్యలలో బాగా ఆరితేరినవాడు. మహాభారత యుద్ధంలో తన విద్యలతో కౌరవ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడతాడు. తాంత్రిక విద్యలలో తనకు సాటి వేరొకరు లేరని శ్రీకృష్ణుని నుండీ వరం కూడా పొందుతాడు.
ఇక మరోవైపు కృష్ణునికి మౌర్వి అనే గొప్ప భక్తురాలు ఉండేది. నిజానికి ఆమె ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ. ఒకప్పుడు నరకాసురుడి స్నేహితుడు అయిన మురుడు అనే రాక్షసుడు ఈ భూలోకంలో అల్లకల్లోలం సృష్టిస్తుండేవాడు. అతని ఆగడాలు సహించలేక కృష్ణుడే అతడిని సంహరిస్తాడు. ఆ మురుడి చెల్లెలే ఈ మౌర్వి.
తన అన్న చావుకు కారణం అయిన కృష్ణుడిని చంపడానికి కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది. దాంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించడానికి సిద్ధపడతాడు. అప్పుడు కామాఖ్యదేవి ప్రత్యక్ష్యం అయ్యి… “ఈమె నా భక్తురాలు. ఈమెకు అన్ని విద్యలను నేనే వరంగా ఇచ్చాను. కాబట్టి ఈమెను వదిలెయ్యి” అని కృష్ణుడిని కోరుతుంది. వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అలాగే కామాఖ్యదేవి మౌర్వితో “ఈ కృష్ణుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారం” అని చెప్తుంది. దీంతో మౌర్వి కృష్ణుడి పాదాల మీద పడి క్షమాపణ కోరుతుంది. అప్పటి నుంచి ఆమె కృష్ణుడి భక్తురాలిగా మారింది.
ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని అనుకోని కారణాల వల్ల యోధుడైన ఘటోత్కచునికీ, గొప్ప భక్తురాలైన మౌర్వికీ వివాహం జరుగుతుంది. వీరిద్దరికీ పుట్టిన కుమారుడే ఈ బర్బారికుడు.
పుట్టుకతోనే బర్బారికుడు గొప్ప సామర్ధ్యం కలవాడు. చిన్నతనంలోనే తన తల్లి దగ్గర అన్ని శస్త్ర విద్యలు నేర్చుకుని గొప్ప వీరుడిగా పేరు పొందాడు. ఇక తల్లి ఆశీర్వాదంతో పరమ శివుని మెప్పు పొంది… అద్భుత శక్తులు గల మూడు బాణాలు పొందుతాడు. అప్పటినుండీ బార్బారికుడు “త్రిబాణధారి” అని పిలవబడేవాడు. అలాగే, అగ్ని దేవుడు నుండి ఒక ప్రత్యేక విల్లును కూడా పొందాడు. ఈ కారణంగా ఇతను “ముల్లోకాల్లో అజేయుడు”గా నిలిచాడు.
పుట్టినప్పటినుండీ బార్బారికుడికి మహాభారత యుద్ధాన్ని చూడాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఆ విషయాన్ని తన తల్లితో చెప్తాడు. అతని తల్లి కూడా అందుకు అంగీకరిస్తుంది. అయితే, ఆ యుద్ధంలో నీవు ఎవరి పక్షాన నిలిచి పోరాడతావు? అని ఆమె అడగగా… బలహీనుల వైపు నిలిచి పోరాడతానని తన తల్లికి వాగ్దానం చేస్తాడు బార్బారికుడు.
ఇది కూడా చదవండి: The Untold Story of Vrishasena
బార్బారికుడు యుద్ధానికి సాక్షిగా ఎలా మారాడు?
బార్బారికుడి 3 బాణాలు ఎంత శక్తివంతమైనవంటే – మొదటి బాణం టార్గెట్ ని గుర్తు పెట్టుకుంటుంది. రెండవ బాణం ఆ టార్గెట్ ని మార్క్ చేసి వస్తుంది. మూడవ బాణం టార్గెట్ ఫినిష్ చేస్తుంది. ఇలా ఈ 3 బాణాలు కూడా తమ టార్గెట్ రీచ్ అవగానే తిరిగి అమ్ములపొదిలోకి వచ్చి చేరతాయి.
అయితే, మొదటినుంచీ బార్బారికునికి మహాభారత యుద్దాన్ని చూడాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఆ క్యూరియాసిటీతోనే మాటి మాటికి యుద్ధమెప్పుడు జరుగుతుందని కృష్ణుని అడుగుతుండేవాడు.
ఇక యుద్ధం ప్రారంభం కావటానికి కొద్దిరోజుల ముందు ప్రతి యోధుడినీ పిలిచి కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. ‘నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు?’ అని. అప్పుడు భీష్ముడు 20 రోజులు చాలని చెపితే, ద్రోణుడు 25 రోజులు కావాలని, కర్ణుడు, 24 రోజులు సరిపోతాయని, అర్జునుడు 28 రోజులు పడుతుందని ఇలా వారి వారి సామర్ధ్యాలని బట్టి చెపుతూ వస్తారు. ఇలా తలా ఓరకంగా చెబుతారు. కానీ, బార్బారికుడు మాత్రం నేను బరిలోకి దిగితే కేవలం ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు. ఆ మాటకి శ్రీకృష్ణుడు షాక్ అయి… అదెలా సాధ్యం? అని అడుగుతాడు. అప్పుడు బార్బారికుడు తనకి తల్లి ఇచ్చిన వరం గురించి, అలాగే తన వద్ద గల మూడు బాణాల గురించి వివరిస్తాడు.