హిందూ మతం మొదటినుంచీ ఈ ప్రపంచానికి వాల్యూస్ ని పరిచయం చేస్తూ వచ్చింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల రూపంలో వాటిని ప్రజలకి అందించింది. అదే హిందూ మతం మనిషి ఈ సొసైటీలో మొరాలిటీతో ఎలా బతకాలో కూడా నేర్పించింది. అయితే, ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో నైతిక విలువలు పాటిస్తూ, ధర్మ బద్దంగా నడుచుకున్నందుకు యమ God of Mortality గా ఎలా మారాడు? అలానే, ప్రేమని పంచుతూ, భక్తి పూర్వకంగా నడుచుకున్నందుకు యమీ Goddess of Immortality గా ఎలా మారింది? అసలు వీరి మద్య ఉన్న రిలేషన్ ఏంటి? వీరి రిలేషన్ నెక్స్ట్ జెనరేషన్ కి ఎలాంటి లైఫ్ లెసన్స్ నేర్పించింది అనేది ఈ స్టోరీలో చూద్దాం.
యమ మరియు యమీల పుట్టుక వెనుక కథ
మార్కండేయ పురాణం ప్రకారం, దేవశిల్పి అయిన విశ్వకర్మ తన కూతురు సంజనని సూర్య భగవానుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈమెనే ‘శరణ్యు’ అని కూడా పిలుస్తారు అయితే, సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉండటంతో… సంజన ఆ కిరణాల వేడిని తట్టుకోలేక పోయేది.
సంజన గర్భం ధరించి ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడు ప్రేమగా తన దగ్గరికి రాగానే… ఆ ప్రకాశాన్ని చూడలేక భయంతో కళ్ళు మూసుకొంది. వెంటనే సూర్య భగవానుడు దానిని అవమానంగా భావిస్తాడు. కోపంతో నీకు పుట్టబోయే సంతానం జీవుల మరణానికి కారణమవుతాడని శపిస్తాడు.
ఆమె భయంతో ఒణికిపోతూ మళ్ళీ ఆయనని చూడటానికి ప్రయత్నిస్తుంది. ఈసారి కళ్ళు తెరిచి ఉంచడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది కానీ, కళ్ళు తెరవలేక, మూయలేక నానా ఇబ్బందులూ పడుతూ చివరికి మళ్ళీ కళ్ళు మూసుకొంటుంది. ఈసారి సూర్యుడు దానిని మరింత అవమానంగా భావిస్తాడు. పట్టరాని కోపంతో నీకు పుట్టబోయే సంతానం చెంచెలమైనదిగా ఒంపులు తిరుగుతూ జీవుల జీవితానికి కారణమవుతుందని శపిస్తాడు.
అలా సూర్య మరియు సంజన దంపతులకి యమ మరియు యమి అనే పేరుతో ట్విన్స్ పుడతారు. వీరిలో యమ జీవులు మరణించటానికి కారణమైతే, యమీ జీవులు జీవించటానికి కారణమవుతుంది.
యమ అంటే ఏమిటి?
“యమ” అనే పేరు సంస్కృత పదం “యం” నుండి పుట్టింది. దీని అర్థం “నిగ్రహం” లేదా “నియంత్రణ”. ఎందుకంటే ఇతను చనిపోయినవారి ఆత్మలను నియంత్రిస్తాడు. అలాగే వాళ్ళు తమ జీవితంలో చేసిన కర్మల ఆధారంగా శిక్షలు విధిస్తాడు. ఇంకా మరణానంతర జీవితాన్ని ప్రసాదిస్తాడు.
ఇంకా యమను కాలా – అంటే ‘సమయం’, పాశి – అంటే పాముని మోసేవాడు’ మరియు ధర్మరాజు – అంటే ‘ధర్మ ప్రభువు’ వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.
మరణం మరియు అమత్వం కలపటం
పురాణాలలో, యముడిని నాలుగు చేతులు, పొడుచుకు వచ్చిన కోరలు, మేఘాల ఛాయ కలిగి ఉండి, చూడటానికి ఎంతో కోపంతో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఎరుపు, పసుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి; ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో పాశం పట్టుకొని, గేదె మీద స్వారీ చేస్తూ, జ్వాలా మేఘాల పైన తిరుగుతున్నట్లు చెప్తారు. ఈ క్రమంలో అతను చనిపోబోతున్న వ్యక్తుల జీవితాలను తన పాశం విసిరి స్వాధీనం చేసుకుంటాడు. దీనినే ‘యమపాశం’ అంటారు.
హిందూ మతం, బౌద్ధమతం మరియు కొన్ని ఇతర మతాలలో యముడిని ఓ దేవునిగా భావిస్తారు. హిందూ మతంలో అతను మరణం, న్యాయం మరియు ధర్మానికి దేవుడు. అలాగే, అతను ఓ భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నట్లుగా చిత్రీకరించబడతాడు.
సాదారణంగా యముడు మరణించిన వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా అతనికి శిక్షలు విధించటం కోసం అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. శిక్షా కాలం పూర్తవగానే తిరిగి అతనికి మరో జీవితాన్ని కల్పిస్తాడు. ఈ విధంగా యమ మొరాలిటీ మరియ ఇమ్మొరాలిటీని కనెక్ట్ చేస్తాడు.
యమి అంటే ఏమిటి?
‘యమి’ అనే పేరు సంస్కృత పదం “యమ” నుండి పుట్టింది. దీని అర్థం “జంట”. ఎందుకంటే, ఈమె జనుల పాపాలను కడిగివేసి, మోక్షాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు.
ఇంకా యమిని సూర్యతనయ, సూర్యజ, రవినందిని, కాళింది, యమునా అనే పేర్లతో కూడా పిలుస్తారు.
మరణాన్ని తొలగించి అమరత్వాన్ని ఇవ్వటం
అగ్ని పురాణం ప్రకారం, యమునా దేవి తరచుగా పర్వతం, లేదా తాబేలుపై నిలబడి, నీటి కుండని కానీ లేదా పూల దండని కానీ పట్టుకుని ఉన్న ఓ అందమైన యువతిగా చిత్రీకరించబడింది.
ఆమె స్వచ్ఛత, ప్రేమ మరియు భక్తితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే, ప్రజలను శుద్ధి చేసి, మోక్షాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. యమీ ఒక ప్రేమగల దేవత అని చెప్పవచ్చు. ప్రజల పాపాలన్నిటినీ కడిగివేసి, వారిని మరణం పట్ల నిర్భయంగా మార్చే శక్తి ఉందని నమ్ముతారు. ఈవిధంగా యమి మొరాలిటీని పోగొట్టి ఇమ్మొరాలిటీని అందిస్తుంది.